Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశి-జయ బంధంలో షాకింగ్ నిజాలు.. జంతువుల కంటే హీనమా? పళని మాఫియా మెంబర్ ఐతే.. శశి డాన్..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శశికళ మీద పడ్డాడు. గతంలో శశికళ జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ.. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో జైలుకెళ్లిపోయిన చి

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (12:43 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శశికళ మీద పడ్డాడు. గతంలో శశికళ జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ.. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో జైలుకెళ్లిపోయిన చిన్నమ్మ గురించి సినిమా తీసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇందులో భాగంగా  రామ్ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. దివంగత జయలలిత, శశికళల మధ్య ఉన్న బంధంలో అనేక షాకింగ్ నిజాలున్నాయని-పోయస్ గార్డెన్‌లో పని చేస్తున్న వారు ఈ నిజాలను తనకు చెప్పారని వర్మా ట్వీట్ చేశాడు. అంతేగాకుండా జయలలిత-శశికళల మధ్య తాను తెరకెక్కించే 'శశికళ' సినిమాలో ఈ నిజాలను బయటపెడతానని వర్మ ట్వీట్ చేశాడు.
 
అంతేగాకుండా తమిళ రాజకీయాలపై కూడా రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. మెజారిటీ ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు పలకడానికి కారణం, వారంతా శశికళకు చెందిన మన్నార్ గుడి మాఫియా ఎంపిక చేసినవారేనని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని కూడా పోయస్ గార్డెన్‌లో పని చేస్తున్న ఓ తోటమాలి చెప్పాడని వర్మ ట్వీట్ చేశాడు. కనీసం వ్యతిరేకించే అవకాశాన్ని కూడా ఎమ్మెల్యేలకు శశికళ ఇవ్వడం లేదని వర్మ వ్యాఖ్యానించాడు. 
 
ఇంకా మన్నారు గుడి మాఫియా సభ్యుడైన పళని స్వామి తమిళనాడు సీఎం అయితే.. డాన్ శశికళ జైలు నుంచే తమిళ సర్కారును నడిపిస్తోందని వర్మ విమర్శించాడు. జంతువులను హింసించే జల్లికట్టు పట్ల తమకున్న ప్రేమపై తమిళులు కనీసం ఒక శాతమైనా గర్వించవచ్చని... ఎందుకంటే తమిళ నాయకులు ప్రజలను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారని చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments