Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవిస్తూ రాంగోపాల్ వర్మ.. పక్కనే సురేఖా వాణి కుమార్తె సుప్రీత... ఏంటి సంగతి?

ఠాగూర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (11:48 IST)
వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్తంత విరామం దొరికితే చాలు మద్యం సేవిస్తూ కొత్త హీరోయిన్లతో కలిసి ఫోటోలు దిగుతుంటారు. ఆ మధ్య హీరోయిన్ అపర్ణ ఆయన దిగిన ఫోటోలు, ఆమెతో ఆయన తీసిన ఫోటో షూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్ నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీతతో రాంగోపాల్ వర్మ కనిపించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వర్మం మద్యం సేవిస్తూ కూర్చొనివుంటే, ఆయన పక్కన సుప్రీత కూర్చొని ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
నిజానికి సోషల్ మీడియా తల్లి సురేఖ వాణి, కుమార్తె సుప్రీతలు సోషల్ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఈ తల్లీ కుమార్తెలిద్దరూ నైటే పార్టీలతో బిజీగా గడుపుతుంటారు. ఆ మధ్యన సుప్రీతకు సురేఖ స్వయంగా మద్యం తాగిస్తున్న ఒక ఫోటో బాగా వైరల్ అయింది. పైగా, అన్ని విషయాల్లోనూ వీరిద్దరి మధ్య మంచి అవగాహనతో ఉండటంతో తల్లికుమార్తెల కంటే మంచి స్నేహితులుగా మెలుగుతుంటారు. 
 
ఈ క్రమంలో రాంగోపాల్ వర్మతో కలిసి సుప్రీంత కలిసివున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో వర్మ మద్యం సేవిస్తుండగా, ఆయన పక్కనే సుప్రీత కూర్చొని ఉంది. మరి తన తదుపరి చిత్రంలో సుప్రీతకు హీరోయిన్‌గా అవకాశం ఇస్తారా లేదా అన్నది ఆలస్యంగా తెలియనుంది. కాగా, సుప్రీత హీరోయిన్‌గా బిగ్ బాస్ ఫేం అమర్ దీప్ చౌదరి హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. మరోవైపు సురేఖ వాణి తన భర్త చనిపోవడంతో అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తుంది. పైగా, తన కుమార్తె లోకంగా ఆమె ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారు తల్లీకుమార్తెల కంటే మంచి స్నేహితురాళ్లుగా కలిసిమెలిసి ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments