Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

దేవి
శుక్రవారం, 5 డిశెంబరు 2025 (13:07 IST)
Ram Gopal Varma - Showman
దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం షో మ్యాన్. మ్యాడ్ మాన్స్టర్ అన్నది ట్యాగ్ లైన్. ప్రముఖ నటుడు సుమన్ ఇందులో విలన్ గా నటిస్తుండడం విశేషం. సుమన్ విలన్ గా నటించిన రజినీకాంత్ చిత్రం శివాజీ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. "నూతన్" అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నాడు.

ఆర్జీవీతో ఇంతకుముందు "ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2" చిత్రాలు నిర్మించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి భీమవరం టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ 120గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
రాంగోపాల్ వర్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. రాంగోపాల్ వర్మ హీరోగా... సుమన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ - అప్పాజీ, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నూతన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments