Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీ వర్సెస్ రామ్ గోపాల్ వర్మ: చూడు శివాజీ.. నాకు క్లాసు పీకొద్దు!

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (19:56 IST)
సినీ నటుడు శివాజీకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హితవు పలికారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంగవీటి సినిమా విషయంలో తాను ఏం తీయాలనుకున్నానో అదే తీస్తానని వర్మ తెలిపారు. సందర్భంగా సినీ నటుడు శివాజీ ఆ లైవ్ ప్రోగ్రాంలోకి వచ్చి 'వర్మ గారూ, మీరు ఇలాంటి సినిమా తీయడం సరికాద'ని హితవు పలికాడు. దానికి వర్మ 'నాకు నచ్చిన సినిమా నేను తీసుకుంటాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి' అని సీరియస్‌గా చెప్పారు. ఇందుకు శివాజీ స్పందిస్తూ, 'సామాజిక బాధ్యత మీకు లేదా?' అని ప్రశ్నించాడు.
 
'తనకు కూడా సామాజిక బాధ్యత ఉందని, తానేం చేస్తున్నానో తనకు తెలుస'ని వర్మ బదులిచ్చారు. ఇంతలో శివాజీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా, 'చూడు శివాజీ.. తాను క్లాసు పీకొద్దు... తానేం చేస్తున్నానో, తానేం చేయాలో తనకు తెలుస'ని వర్మ ఘాటుగా సమాధానం చెప్పారు. దీనికి ఆగ్రహించిన శివాజీ 'మీరు చెబితే మేమంతా వినాలి... మేము చెబితే మాత్రం మీరు వినరా?' అని ప్రశ్నించాడు. అయితే, ఇందుకు వర్మ సమాధానం చెప్పలేదు.

ముళ్లపందిని వేటాడబోయే మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments