అబ్బే.. మీటూలో నా పేరు రాలేదేంటి? రామ్ గోపాల్ వర్మ

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (11:22 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచాడు. దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యం సాగుతున్న నేపథ్యంలో మీటూపై వర్మ స్పందించాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్లు తమకు జరిగిన చేదు అనుభవాల గురించి నిర్మొహమాటంగా బయటికి వెల్లగక్కుతున్న నేపథ్యంలో.. ఈ ఉద్యమంలో తన పేరు రాకపోవడం తనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని వర్మ వ్యాఖ్యానించాడు. 
 
తనను అందరూ అలాంటి వాడని అంటుంటారు. మీటూ ఉద్యమంలో భాగంగా ఎందరి పేర్లో వెలుగులోకి వచ్చాయి. తన పేరు మాత్రం బయటకు రాలేదు. ఇది బాలీవుడ్ ప్రముఖులను షాక్‌కు గురి చేసింది. పొద్దున లేస్తే తొడల గురించి మాట్లాడుతూ.. జీఎస్టీ వంటి సినిమాలు చేస్తుంటే తన గురించి ఇక ఏం చెబుతారు.. అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. కాగా తాజాగా రామ్ గోపాల్ వర్మ సమర్పణలో భైరవగీత విడుదలకు సిద్ధమవుతోంది. 
 
మరోవైపు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను గతంలో లక్ష్మీ పార్వతికి వినిపిస్తానని వర్మ చెప్పాడు. కానీ ప్రస్తుతం మాట మార్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ స్క్రిప్టును ఎవరికీ వినిపించాల్సిన అవసరం లేదంటూ షాకిచ్చాడు. దీంతో మరో కొత్త వివాదానికి వర్మ తెరలేపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments