మెగా బ్రదర్ దెబ్బకు రాంగోపాల్ వర్మ‌కు పెరిగిన రేంజ్.. "రౌడీ నంబర్ 150"గా వస్తాడట

'ఖైదీ నంబర్ 150' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇపుడు మాటల యుద్ధానికి తెరతీశాయి. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మలను ఉద్దే

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (14:01 IST)
'ఖైదీ నంబర్ 150' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇపుడు మాటల యుద్ధానికి తెరతీశాయి. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మలను ఉద్దేశించి నాగబాబు 'వాడు.. వీడు', 'కుసంస్కారి.. అక్కుపక్షి' అంటూ చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్‌తో పాటు.. సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. వంగవీటి పరాజయంతో కిమ్మనకుండా ఉన్న రాంగోపాల్ వర్మ.. నాగబాబు చేసిన వ్యాఖ్యలతో బలం పుంజుకుని ట్విట్టర్ వేదికగా మాటలతూటాలు పేల్చుతున్నాడు. అంతేనా.. తాను హీరోగా "ఖైదీ నంబర్ 150"వ చిత్రాన్ని తీయనున్నట్టు ప్రకటించి సంచలనం రేపాడు.
 
తనపై నాగబాబు చేసిన కామెంట్స్‌కు ప్రతిగా కౌంటర్ ఇచ్చేందుకు వర్మ రంగంలోకి దిగాడు. శనివారం రాత్రి నుంచి మొదలైన వర్మ ట్విట్ల పర్వం ఆదివారం అర్థరాత్రి వరకూ కొనసాగింది. తనదైన పైత్యాన్ని ఆర్జీవీ చూపించారు. 'అద్దాల మేడలో ఉండే వాళ్లు ఇతరులపై రాళ్లు వేయకూడదు-భగవద్గీత' అంటూ ట్వీట్‌ చేశారు. 'తన కుటుంబంలోని పనికిమాలినవాళ్లను ప్రేమించడం వారినే విధ్వంసం చేస్తుంది' అని డామన్ వయాన్స్ అన్న మాటను వర్మ కోట్ చేశాడు.
 
తాజాగా నాగబాబు సార్ శనివారం అంతగా అరచి ఇవాళ ఇంత సైలంట్‌గా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించాడు. తేలు పిల్ల కుట్టిందా.. వాన పాము కరిచిందా అంటూ మరోసారి కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. అంతేకాదు 'గౌతమిపుత్ర శాతకర్ణి' మన సొంత టాలెంట్ అని.. 'ఖైదీ నెం.150' పొరుగు రాష్ట్రం టాలెంట్ అంటూ వర్మ కామెంట్స్ చేసి మాటల యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు.
 
ఇక వీటితో పాటు 'రౌడీ నంబర్‌ 150' అంటూ స్టీల్‌ గ్లాస్‌ను కంటికి అడ్డంగా పెట్టుకుని దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంలో తానే హీరో పాత్రను పోషించనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు. అంతేనా.. ఓసారి మెగా అభిమానులకి క్షమాపణలు చెబుతాడు. అంతలోనే నాగబాబుపై సటైర్లు వేస్తాడు. మెగాబ్రదర్ అసమర్థుడు అని తేల్చేస్తాడు. 'జబర్దస్త్' కెరీర్‌ని చక్కదిద్దికోవాలని సూచిస్తాడు. మొత్తంగా నాగబాబు వర్మపై చేసిన కామెంట్లు నాగబాబుకు పేడపై రాయి వేసిన చందంగా మారాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments