Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకుడు పాలు తాగాడన్నది ఎంత సంచలనమో.. వర్మ దండం పెట్టాడన్నది అంతే సెన్సేషన్!

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (15:03 IST)
రామ్ గోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. వర్మ సినిమాల కంటే వ్యక్తిగత విషయాలపైనే శ్రద్ధ చూపిస్తాడనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు దేవుడు టాపిక్‌ను టచ్ చేసే వర్మ.. గత ఏడాది వినాయక చవితి సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య పుష్కరాల విషాదం టైంలోనూ వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. 
 
ఆయనో నాస్తికవాది అని.. దేవుణ్ని అస్సలు నమ్మడని.. అందరికీ తెలుసు. తన సినిమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా వర్మ ఎప్పుడూ ఇష్టపడింది లేదు. అలాంటోడు దేవుడికి తలవంచి దండం పెడుతున్న దృశ్యం కనిపిస్తే అంత కంటే బిగ్ న్యూస్ అంటూ ఏమన్నావుందా..? 
 
అదే జరిగింది మరీ.. మంచు మనోజ్ ఆ సీన్‌ను క్యాచ్ చేశాడు. ఎక్కడ దొరికాడో వర్మ ఎలా దొరికాడో కానీ.. వర్మ వినాయకుడికి దండం పెడుతూ కెమెరాకు చిక్కేశాడు. ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసి.. ‘‘చిట్టచివరికి వర్మ దేవుడికి తలవంచాడు’’ అనే వ్యాఖ్య జోడించి వదిలేశాడు మనోజ్. ఇక అంతే ట్విట్టర్లో ఈ ఫొటో హాట్ టాపిక్ అయిపోయింది. 
 
వినాయకుడు పాలు తాగాడన్నది అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో.. వర్మ వినాయకుడికి దండం పెట్టాడన్నది అంతే సెన్సేషన్ అయి కూర్చుంది. వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ ఈ ఫొటో మీద ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ‘‘ఇంత సడెన్ నువ్విక్కడికి ఎందుకొచ్చినట్లు. వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి.. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని వర్మను దేవుడు తిడుతుండొచ్చు’’ అని వ్యాఖ్యానించాడు పూరీ జగన్నాథ్. ఇలాంటి జోకులు ఈ ఫోటోపై చాలానే పేలుతున్నాయి.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments