Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడివాడ ప్రజలే గోవాకు వెళ్లారు.. గోవా ప్రజలు గుడివాడకు రాలేదు... వర్మ సెటైర్లు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (12:43 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాకు చెందిన ఏపీ మంత్రి కొడాలి నాని తన సొంత నియోజకవర్గమైన గుడివాడ ప్రజలకు గోవా కల్చర్ పరిచయం చేశారు. కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్న తరుణంలో ఏపీ మంత్రిగా ఉన్న కొడాలి నాని తన అధికారబలంతో గుడివాడలో గోవా క్యాసినో కల్చర్‌ను దిగుమతి చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు. గుడివాడ ప్రజలే గోవాకు వెళ్లారని, గోవా ప్రజలు గుడివాడకు రాలేదంటూ పంచ్‌లు విసిరారు. అంతేకాకుండా, గుడివాడలో క్యాసినో నిర్వహించడాన్ని చిన్నచూపు చస్తున్నవారంతా గోవా, లాస్ వెగాస్ వంటి మెగా నగరాలను తక్కువ చేయడమేమిటని ఆయన ట్వీట్ చేశారు. 
 
గుడివాడను ప్యారిస్, లండన్, లాస్ వెగాస్ వంటి నగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్న మంత్రి కొడాలి నానిని అభినందిస్తున్నట్టు చెప్పారు. క్యాసినో కారణంగా గోవా ప్రజలు గుడివాడ వచ్చేలా ఆధునకీకరిస్తున్న మంత్రి కొడాలి నాని అందరూ మెచ్చుకోవాలని వర్మ పేర్కొన్నాడు. అంతేకాకుండా, తన ట్వీట్‌లో జై గుడివాడ అంటూ క్యాప్షన్ పెట్టాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments