Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శాతకర్ణి' సత్తాను మెగా సోదరులు గుర్తించకపోతే.. మరుగుజ్జులుగానే మిగిలిపోతారు : వర్మ తాజా ట్వీట్

"గౌతమిపుత్ర శాతకర్ణి" మూవీపై వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తనదైనశైలిలో స్పందించాడు. ఈ ఫిల్మ్ ఘన విజయం సాధించడంపై బాలకృష్ణను ఆకాశానికెత్తేశాడు. అరువు తెచ్చుకున్న కథలతోకాకుండా తెలుగు సినీపరిశ్రమ

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (09:59 IST)
"గౌతమిపుత్ర శాతకర్ణి" మూవీపై వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తనదైనశైలిలో స్పందించాడు. ఈ ఫిల్మ్ ఘన విజయం సాధించడంపై బాలకృష్ణను ఆకాశానికెత్తేశాడు. అరువు తెచ్చుకున్న కథలతోకాకుండా తెలుగు సినీపరిశ్రమ ఖ్యాతిని తగ్గించకుండా ఒరిజినల్ స్టోరీతో మన ఖ్యాతిని వ్యాపింపజేసిన బాలయ్య, క్రిష్‌లకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. బాలయ్యకు '100 ఛీర్స్' అంటూ అభినందించాడు. 
 
"హే క్రిష్, గౌతమీపుత్రకు వచ్చిన టాక్‌ కంగ్రాట్స్. నా అంచనా ఏ మాత్రం తప్పకుండా, ఇంత కరెక్ట్ అయినందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది", అంటూ క్రిష్‌కు అభినందనలు తెలిపాడు. తన 100వ సినిమా విజయంతో గొప్ప సినిమాల విషయంలో... బాలయ్య 150 మెగా రెట్లు ముందడుగు వేశాడంటూ వర్మ కొనియాడాడు.
 
బాలకృష్ణ వందో సినిమా చలనచిత్ర రంగంలో 150 రెట్లు మెగా రికార్డ్ అంటూ రాసుకొచ్చాడు. బాహుబలితో మొదలైన టాలీవుడ్ హవా, శాతకర్ణితో మరింత రెట్టింపైందని, ఈ  విషయాన్ని మెగా సోదరులు గుర్తించకపోతే.. మరుగుజ్జులుగానే మిగిలిపోతారని సెటైర్లు వేశాడు. అలాగే ఖైదీ చిత్రంతో చిరంజీవి పదేళ్లు వెనక్కిపోగా... శాతకర్ణి చిత్రంతో బాలకృష్ణ పదేళ్లు ముందుకు వెళ్లారని ట్వీట్ చేశారు. 
 
రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ఇవే... 
Balayya in his 100th film only seems to have become 150 times more Mega advanced in terms of great cinema
- Ram Gopal Varma (@RGVzoomin) January 12, 2017
What Bahubali started GPSK is taking telugu cinema way more forward and even now if Mega people don't realise they might become Mini
- Ram Gopal Varma (@RGVzoomin) January 12, 2017
Salute to n Balayya for pushing telugu cinema pride to skies with original content instead of bringing down with borrowed content
- Ram Gopal Varma (@RGVzoomin) January 12, 2017
Hey Am supremely thrilled to hear my judgement went so right ..Congrats on the roaring talk of ..100 Cheers to u nd Balayya
- Ram Gopal Varma (@RGVzoomin) January 12, 2017

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎన్నికల కౌంటింగ్.. బెట్టింగ్‌లు.. నరాలు తెగే ఉత్కంఠ.. గెలుపు ఎవరిదో..?

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments