ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసి సిద్ధంగా ఉండండి.. వెన్నుపోటు ఫ్యాన్స్‌కు వర్మ పిలుపు

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:27 IST)
నందమూరి అభిమానులకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ విజ్ఞప్తి చేశారు. తన తాజా చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గురువారం ఉదయం 9.27 గంటలకు ఈ ట్రైలర్ విడుదల చేస్తానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
దీనికంటే ముందుగా ఆయన ఎన్టీఆర్, నందమూరి ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. "ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా... వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా... రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గర్లో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెఢీగా ఉండండి. ఉదయం 9.27 గంటలకు కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతుంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు" అంటూ తనదైనశైలిలో ట్వీట్ చేశారు. 
 
కాగా, ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోటు, ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతికి మధ్య జరిగిన ప్రేమ తదితర అంశాలను ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments