Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కల్యాణ్.. చాలా కమ్మగా కాపు కాసే శక్తి... అత్యున్నత నాయకుడు: వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్విట్టర్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ తెలుగు ప్రజలందరినీ కాపు కాసే శక్తి అవుతాడని, తనకు ఆ ధీమా ఉందని వర్మ ట్వీట్

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2016 (12:54 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్విట్టర్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ తెలుగు ప్రజలందరినీ కాపు కాసే శక్తి అవుతాడని, తనకు ఆ ధీమా ఉందని వర్మ ట్వీట్ చేశాడు.

పవన్ కల్యాణ్... చాలా కమ్మగా కాపు కాసే శక్తి లాంటి అత్యున్నత నాయకుడు వంటి వాడని రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశాడు. పవన్‌.. చాలా కమ్మగా కాపు కాసే శక్తి లాంటి అత్యున్నత నాయకుడు వంటి వాడని వర్మ​ కామెంట్‌ చేశాడు. 
 
విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వర్మ వంగవీటి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాటలో కాపు, కమ్మ కులాల ప్రస్తావన ఉంది. వర్మ తాజాగా పవన్‌పై చేసిన కామెంట్స్‌‌లో కమ్మ, కాపు పేర్లు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వర్మ వెంటనే క్లారిటీ ఇచ్చాడు. కమ్మగా అంటే స్వీట్‌ అని అర్థమని, కొందరు భావిస్తున్నట్టు కాపు, కమ్మ కులాలకు సంబంధించినది కాదని ట్వీట్‌ చేశాడు.
 
ఇటీవల పవన్ తిరుపతిలో నిర్వహించిన జనసేన బహిరంగ సభపై వర్మ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎక్కువగా మెగా ఫ్యామిలీ మీద విమర్శనాస్త్రాలను మాత్రమే సంధించే వర్మ ఈ సారి మాత్రం ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఏకంగా పవన్ అంత నిజాయితీ పరుడు ఆంధ్రప్రదేశ్‌లో మరెవరూ లేరంటూ పొగిడేశాడు. పవన్ లాంటి నాయకుడు ఉండటం ఏపీ ప్రజల అదృష్టమంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments