Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కుమారుడి పేరుపై రచ్చ.. వర్మ పోస్టుపై కుమార్తె ఫైర్.. పనిలేక పోస్టులు చేస్తున్నావా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడి పేరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తన నాలుగో బిడ్డకు పెట్టిన 'మార్క్ శంకర్ పవనోవిచ్' అనే పేరుపై వివాదాస్పద దర్శకుడు రామ

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (09:48 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడి పేరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తన నాలుగో బిడ్డకు పెట్టిన 'మార్క్ శంకర్ పవనోవిచ్' అనే పేరుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన తనదైన శైలిలో పోస్టు చేశాడు. 
 
వర్మ పోస్టుపై స్వయంగా ఆయన కుమార్తె మండిపడింది. వీరిద్దరి మధ్య పవన్ కుమారుడి పేరు పెద్ద రచ్చకు దారితీసింది. ఈ పేరుకు, చరిత్రకు సంబంధాన్ని తెలుపుతూ, వర్మ చేసిన పోస్టుకు వర్మ కుమార్తె రేవతి వర్మ స్పందించింది. ఈ పేరుకు, చరిత్రకు లింకేంటి.. ఈ పోస్టులో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదని.. సామాన్యులకు అందని పదాలు వాడుతూ పోస్టులు చేయడం ఏంటని తప్పుబట్టింది. ఏం పనీలేక ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆక్షేపించింది. 
 
ఇక స్వతహాగా పవన్‌కు పెద్ద ఫ్యాన్ అయిన రేవతి వర్మ వ్యాఖ్యలను వర్మ ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. నీకసలు అర్థం చేసుకోవడమే రాదని అక్షింతలు వేశాడు. అందరికంటే పవన్ కల్యాణ్‌ను తాను ఎక్కువగా ప్రేమిస్తున్నానని.. తాను ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments