లక్ష్మీస్ ఎన్టీఆర్‌: ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి ఎలా చేరువైందో చూస్తారు..

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (15:03 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' పేరిట ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో వున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి నడిచిన కథను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేస్తున్నారు. 
 
తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వ్యక్తిగతాన్ని ఈ సినిమాలో చూడొచ్చునని వర్మ అన్నారు. క్రిష్ రూపొందిస్తున్న కథానాయకుడులో ఎన్టీఆర్ సినీ జీవితం, మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం చూస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో తారక రామారావు గారి వ్యక్తిగత జీవితం వుంటుంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమా చూడొచ్చునని వర్మ చెప్పుకొచ్చారు. 
 
ఎన్టీఆర్ పెద్ద స్టార్. ఆయనకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ లక్ష్మీ పార్వతి విషయానికి వస్తే ఆమె ఓ సాధారణ మహిళ. పెద్ద అందగత్తె కూడా కాదు. అలాంటి ఆమె ఎన్టీఆర్‌కు ఎలా చేరువైంది.. అనేది ఈ సినిమాలో చూడొచ్చు. తన పరిశోధన కూడా అక్కడి నుంచే ప్రారంభమైందని వర్మ చెప్పుకొచ్చాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments