Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానా బాటలో చెర్రీ.. న్యూజెర్సీ ప్రోగ్రామ్‌కు గైర్హాజరు.. కారణం ఫ్యామిలీలో ఒకరికి?

న్యూజెర్సీలో జరగనున్న ఓ ఛారిటీ ఈవెంట్‌కి హీరో రామ్‌చరణ్ హాజరుకావడంలేదు. తద్వారా ఇలియానా బాటలోనే చెర్రీ కూడా నడిచాడు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఉగ్ర బాధితులకు వి

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (19:04 IST)
న్యూజెర్సీలో జరగనున్న ఓ ఛారిటీ ఈవెంట్‌కి హీరో రామ్‌చరణ్ హాజరుకావడంలేదు. తద్వారా ఇలియానా బాటలోనే చెర్రీ కూడా నడిచాడు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్‌బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఉగ్ర బాధితులకు విరాళాలు సేకరించడం కోసం జరిగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చెర్రీకి ఆహ్వానం అందింది. అయితే ఫ్యామిలీలో ఓ వ్యక్తికి మెడికల్‌ ఎమర్జెన్సీ అవసరమైనందున రాలేకపోతున్నట్టు తెలిపాడు. 
 
నిరాశ చెందిన తన అభిమానుల కోసం మరేదైనా చేస్తానంటూ చెర్రీ వివరణ ఇచ్చుకున్నాడు. న్యూజెర్సీలోని పీఎన్సీ ఆర్ట్‌ సెంటర్‌లో హ్యుమానిటీ యునైటెడ్‌ అగైనెస్ట్‌ టెర్రర్‌' ఛారిటీ పేరిట ఈ కార్యక్రమం శనివారం జరగనుంది. ఇందులో మలైకా అరోరాఖాన్‌, ప్రభుదేవా, సోఫీ చౌదరి నటీనటులు పాల్గొంటున్నారు. తొలుత చెర్రీ, అఖిల్, శ్రియ వెళ్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇలియానాకు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా పిలుపొచ్చింది. కానీ ఈ ప్రోగ్రామ్‌కు వెళ్తే అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు సపోర్ట్ చేసినట్లవుతుందనే కారణంతో ఇలియానా నో చెప్పింది. 
 
బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటీనటులకు అమెరికాలోనూ వేలాది మంది అభిమానులున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రంప్‌కి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని భావించి ఆర్‌హెచ్‌సీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇలియానా మాత్రం ట్రంప్‌కు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments