Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ధృవ' కోసం రామ్ చరణ్ ప్రత్యేక కసరత్తు: కశ్మీర్‌లో షూటింగ్ షెడ్యూల్!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (19:39 IST)
'బ్రూస్‌లీ' తర్వాత రామ్‌ చరణ్‌ తన కొత్త సినిమా 'ధృవ' ఈ మధ్యే సెట్స్‌పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్‌ చరణ్‌ ఓ సరికొత్త లుక్‌ ప్రయత్నిస్తున్నారట. ఇప్పటివరకూ తన ప్రతి సినిమాలోనూ ఫిజిక్‌ పరంగా స్ట్రాంగ్‌గా కనిపిస్తూనే, రకరకాల లుక్స్‌తో మెప్పించిన చరణ్‌, కొత్త సినిమాలో ఓ పోలీసాఫీసర్‌ పాత్రలో మరింత కొత్తగా కనిపించనున్నారట.
 
ఇక ఇందుకోసం రామ్‌ చరణ్‌, ఓ ప్రఖ్యాత ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ ఆధ్వర్యంలో వర్కవుట్స్‌ చేస్తున్నారట. అదే విధంగా సినిమాలో కొన్ని యాక్షన్‌ సీక్వెన్సెస్‌ కోసం కూడా రామ్‌ చరణ్‌ పలు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు. గుర్రపు స్వారీతో పాటు పలు ఇతర స్టంట్స్‌ నేర్చుకుంటున్నట్లు స్వయంగా రామ్‌ చరణ్‌ తెలియజేస్తూ, సినిమాలో పాత్ర అవసరం మేరకు కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. ధృవ అన్న టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలోనే కశ్మీర్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ మొదలుకానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments