Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో రామ్ చరణ్‌కు మరో అంతర్జాతీయ గౌరవం!!

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (15:24 IST)
టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌కు మరో అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ మెల్‌బోర్న్‌కు గౌరవ అతిథిగా చరణ్‌కు ఆహ్వానం అందింది. దీనిపై చెర్రీ స్పందిస్తూ, ఈ ఆహ్వానాన్ని ఎంతో గౌరవ సూచకంగా భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, తెలుగు చిత్రపరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తుండటం సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. 
 
ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తమ 15వ ఎడిషన్ వేడుకలకు చరణ్‌ను గౌవర అతిథిగా ఆహ్వానించింది. ఈ సంస్థను స్థాపించి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న వేడుకలకు చరణ్‌కు ఆహ్వానం పంపింది. దీనిపై ఫిల్మ్ ఫెస్టివల్ టీమ్ సభ్యులు మాట్లాడుతూ, తమ 15వ ఎడిషన్ చిత్రోత్సవాలకు రామ్ చరణ్ రానుండటం తమకు మరుపురాని అంశంగా మిగిలిపోతుందన్నారు. వేడుకల్లో చెర్రీ నటించిన ప్రముఖ చిత్రాలను కూడా ప్రదర్శిస్తామని తెలిపారు. భారతీయ చిత్రపరిశ్రమకు చెర్రీ చేసిన సేవలకుగాను భారతీయ కళ, సంస్కృతికి అంబాసిడర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు తనకు వచ్చిన ఆహ్వానంపై చరణ్ స్పందిస్తూ, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో భాగం కావడాన్ని ఎంతో గౌరవరంగా భావిస్తున్నట్టు చెప్పారు. మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తుండటం, ప్రపంచ వ్యాప్త సినీ ప్రముఖులు, అభిమానులతో కనెక్ట్ కావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు, ప్రేమ దక్కడాన్న ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments