తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

దేవీ
శుక్రవారం, 20 జూన్ 2025 (17:33 IST)
Upasana Konidela's Cleankara
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార ఎప్పటికప్పుడు అభిమానుల మనసులను గెలుచుకుంటూ వస్తోంది. ఆమె ఈ రోజు (జూన్ 20) రెండో పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా, ఆమె జీవితంలో మెమరబుల్ మూమెంట్ చోటుచేసుకుంది.
 
గత సంవత్సరం హైదరాబాద్ జూ పార్క్‌కు వెళ్లిన సమయంలో, రామ్ చరణ్, ఉపాసనా, చిన్నారి క్లీంకార ఒక నవజాత తెల్ల బంగాళా పులి పిల్లను చూశారు. ఆ ప్రత్యేక క్షణాన్ని గుర్తుగా ఉంచుతూ, జూ అధికారులు ఆ పులి పిల్లకి ‘క్లీంకార ’ అనే పేరు పెట్టారు. ఇది వారి కుటుంబం జీవుల పట్ల చూపించే ప్రేమకు ఒక చిహ్నంగా నిలిచింది.
 
ఈ రోజు తన రెండో పుట్టినరోజు సందర్భంగా, క్లీంకార మొదటిసారిగా తన పేరును కలిగి ఉన్న తెల్ల పులిని ప్రత్యక్షంగా చూసింది. ఆ చిన్నారి, తెల్లటి పులిని మైమరచి చూడటాన్ని చూసి అందరూ ఆనందపడ్డారు. ఇది చిన్నారి కన్నులలో ఆశ్చర్యం, ప్రకృతితో కలిసిపోయే అనుబంధాన్ని గుర్తు అరుదైన క్షణంగా నిలిచింది
 
జంతువుల పట్ల సహానుభూతి, ప్రేమను ఎప్పుడూ చూపిస్తూ ఉండే రామ్ చరణ్, ఉపాసనా ఈరోజు అధికారికంగా ఆ పులిని దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ జూ కు వారు అందిస్తున్న మద్దతు, జంతు సంరక్షణ పట్ల వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.
 
ఈ పుట్టినరోజు వేడుక ఒక కుటుంబానికే కాదు, మనం ప్రకృతితో కలిసికట్టుగా జీవించాలన్న, ఇతర జీవుల రక్షణ బాధ్యత మనపై ఉందన్న సంకేతాన్ని ప్రపంచానికి గుర్తుచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments