Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటెం సాంగ్‌కు సిగ్నల్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరు?

తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు అగ్ర హీరోల సరసన నటించిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ బ్యూటీ ఇపుడు ఐటమ్ సాంగ్‌లు చేసేందుకు పచ్చజెండా ఊపింది. నిజానికి ఇపుడు వస్తున్న చిత్రాల్లో ఐటమ్ సాంగ్ ఉండటం ఓ ట్రె

Webdunia
సోమవారం, 16 జులై 2018 (11:36 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు అగ్ర హీరోల సరసన నటించిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ బ్యూటీ ఇపుడు ఐటమ్ సాంగ్‌లు చేసేందుకు పచ్చజెండా ఊపింది. నిజానికి ఇపుడు వస్తున్న చిత్రాల్లో ఐటమ్ సాంగ్ ఉండటం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ఈ తరహా పాటల్లో నర్తించేందుకు అగ్ర హీరోయిన్లు సైతం పోటీపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. సినిమాలో నటించే ఇచ్చే పారితోషికం ఒక్క ఐటమ్ సాంగ్‌లో నటిస్తే వస్తుంది.
 
గతంలో పలువురు టాప్ హీరోయిన్లు ఐటెం సాంగులు చేసిన ప్రేక్షకుల్ని మెప్పించారు. అయితే పంజాబీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఇప్పటివరకు స్పెషల్ సాంగ్ చేయలేదు. కెరీర్‌లో తొలిసారిగా ఆమె ఓ ప్రత్యేకగీతానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నారు. క్రిష్ దర్శకుడు. 
 
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో 'వేటగాడు' చిత్రంలోని "ఆకు చాటు పిందె తడిసే" పాటను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పాటకు రకుల్‌ ప్రీత్‌ సింగ్ డ్యాన్స్ చేయనున్నట్లు టాక్. 'వేటగాడు' చిత్రంలో ఎన్టీఆర్, శ్రీదేజంట మీద తెరకెక్కించిన ఈ పాట మంచి ప్రజాదరణ పొందింది. ఈ గీతానికి ఉన్న ప్రజాదరణ దృష్ట్యా ఎన్టీఆర్ బయోపిక్‌లో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌సింగ్ తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments