Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలపతిరావు వయసు తగినట్టుగా ప్రవర్తిస్తే బాగుంటుంది : రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు వయసుకు తగినట్టుగా నడుచుకుంటే మంచిదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సలహా ఇచ్చింది. తాజాగా చలపతిరావు వ్యాఖ్యలపై "రారండోయ్ వేడుక చూద్దాం" హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పంది

Webdunia
మంగళవారం, 23 మే 2017 (14:37 IST)
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు వయసుకు తగినట్టుగా నడుచుకుంటే మంచిదని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సలహా ఇచ్చింది. తాజాగా చలపతిరావు వ్యాఖ్యలపై "రారండోయ్ వేడుక చూద్దాం" హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. చలపతిరావు కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఈ చిత్ర ఆడియో వేడుకలో అమ్మాయిలు హానికరమా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చలపతి రావు సమాధానమిస్తూ అమ్మాయిలు హానికరం కాదుగానీ పక్కలోకి పనికివస్తారంటూ వ్యాఖ్యానించారు. ఇవి వివాదాస్పదమయ్యాయి. మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చలపతిరావుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పైగా, చలపతిరావు కామెంట్ చేసినప్పుడు నాగచైతన్య, రకుల్ నవ్వుతున్నారంటూ ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. 
 
వీటిపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. చలపతి రావు వ్యాఖ్యలపై లేటుగా స్పందిస్తున్నానని, అసలు చలపతిరావు అన్న మాటలకు అర్థమేంటో తనకు తెలియదని, అతడన్న మాటలకు అర్థమేంటో తెలిశాక కోపమొచ్చిందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్టు చెప్పింది. అంతేకాదు.. ట్విట్టర్లోనే రకుల్ తన స్పందనను తెలియజేసింది.
 
ముఖ్యంగా చలపతిరావు తన వయసుకు తగినట్టు ప్రవర్తిస్తే బాగుంటుందని హితవు పలికింది. ఇలాంటి మాటల వల్ల అతడిపై తన చుట్టూ ఉండే వారికి ఏహ్యభావం కలుగుతుందని పేర్కొంది. అంతపెద్ద స్థాయిలో ఉన్నవాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల.. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త వాళ్లపైనా చెడు ప్రభావం పడుతుందన్నారు. కెరీర్ ఆరంభంలో చాలా సందర్భాల్లో చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. చాలా సార్లు మిన్నకుండిపోయానని, కానీ, ఇప్పుడు జరిగిన సంఘటనతో మాత్రం నోరు మెదపకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. సీనియర్లు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆమె హితవు పలికింది. 

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments