80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఐవీఆర్
గురువారం, 17 అక్టోబరు 2024 (22:07 IST)
కర్టెసి-ట్విట్టర్
టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆమెకి ఫిట్‌నెస్ పైన మక్కువ ఎక్కువ. ప్రతిరోజూ తన సొంత వ్యాయామశాలలో వ్యాయామం చేసిన తర్వాత కాని మిగిలిన దినచర్య ప్రారంభిస్తుంటారు. ఇటీవల ఆమె తన జిమ్‌లో 80 కిలోల బ్యాక్‌లిఫ్ట్‌కు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆమెకి వెన్నునొప్పి వచ్చింది. తన వీపు విపరీతంగా నొప్పిపెడుతుండటంతో వర్కవుట్‌ను ఆపేసింది.
 
కొన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకున్న తర్వాత తను నటిస్తున్న కొత్త హిందీ చిత్రం కోసం షూటింగు కోసం వెళ్లింది. కానీ గాయం తీవ్రమై విపరీతంగా బాధపెట్టడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెకి అక్కడ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు.
 
కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. తన ఆరోగ్యం పట్ల సందేశాలు పంపిన అభిమానులకు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

Kavitha: ఆంధ్ర రాజకీయ నాయకులు మాటలు నచ్చవు.. అదేంటి అలా తిట్టుకోవడం?

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments