భ్రమరాంబ పాత్ర రకుల్ కోసమే పుట్టిందా లేక భ్రమరాంబను రకుల్ లాగేసుకుందా?
ఒక సినిమా పాత్ర పదేళ్లు లైఫ్ ఇస్తుందంటే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ ప్రేక్షకులు అలాంటి పాత్రపై చూపే అభిమానం నటించిన పాత్రధారుల భవిష్యత్తునే మార్చేస్తుంది. తెలుగు సినీ రంగంలో క్యూటెస్ట్ గర్ల్‌గా, యంగ్
ఒక సినిమా పాత్ర పదేళ్లు లైఫ్ ఇస్తుందంటే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ ప్రేక్షకులు అలాంటి పాత్రపై చూపే అభిమానం నటించిన పాత్రధారుల భవిష్యత్తునే మార్చేస్తుంది. తెలుగు సినీ రంగంలో క్యూటెస్ట్ గర్ల్‌గా, యంగ్ హీరోల సరసన వరుసపెట్టి సినిమాలు తీస్తూ హీరోయిన్‌లందరినీ పక్కకు నెట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌లోనే నిలిచిపోయే పాత్రను కొట్లాడి మరీ సాధించుకుని బంపర్ చాన్స్ కొట్టేసింది.
బాహుబలి ఫీవర్ నుంచి కాస్త బయటపడి ముందుకు వస్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు భ్రమరాంబ. నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రారండోయ్.. వేడుక చూద్దాం ఇప్పుడు థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ఈ చిత్రంలో భ్రమరాంబ పాత్ర రకుల్ కోసమే పుట్టిందా అనేంతగా పాత్రలో పండిపోయింది.
అసలు ఈ సినిమాలో భ్రమరాంబ పాత్ర రకుల్‌కి దక్కడమే ఒక సినిమా కథను తలపిస్తోంది. అచ్చ తెలుగమ్మాయిలా, పెంకితనంతో కూడిన అమాయకపు పల్లెటూరి పడుచుపిల్లలా అలరించిన బ్రమరాంబ తన కేరక్టర్ కోసం డైరెక్టర్‌కే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ ఈ సినిమా స్క్రిప్ట్‌తో రకుల్ వద్దకు వచ్చినప్పుడు డేట్స్ లేవు.. అయితే సినిమాలో బ్రమరాంబ క్యారెక్టర్ నచ్చి ఆ క్యారెక్టర్‌ను నేనే చేయాలి. ఇంకెవరూ చేయడానికి వీలులేదు అని డైరెక్టర్‌కు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను. ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలాను’ అని చెప్పుకొచ్చిందీ బ్రమరాంబ.
ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా.. డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నా కోసం దాదాపు నాలుగు నెలలు ఆపారని ఇందుకు వారికి థ్యాంక్స్ కూడా చెప్పింది రకుల్. తన కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ ఈ అద్భుతమైన కథను విని కాల్ చేసి నీకోసమే ఆ పాత్ర పుట్టినట్లుంది మిస్ చేసుకోకు అని పోరితే కథ విని వెంటనే సైన్ చేసిన రకుల్ నిజందానే ఆ పాత్ర తన కోసమే పుట్టిందని రుజువుచేసింది.