Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలివుడ్ పిలుస్తోందని టాలీవుడ్‌ను వదులుకుంటానా.. నెవర్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

ఇప్పటివరకు కొలివుడ్‌లో విజయాలను నమోదు చేయని టాలివుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమిళ చిత్ర సీమ అవకాశాల కోసం టాలివుడ్‌లో చాన్సులను పణంగా పెట్టబోనని స్పష్టం చేస్తోంది. తెలుగులో ఆగ్రనటుల సరసన బంపర్ హిట్ కొడుతూ నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున

Webdunia
సోమవారం, 29 మే 2017 (06:29 IST)
ఇప్పటివరకు కొలివుడ్‌లో విజయాలను నమోదు చేయని టాలివుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమిళ చిత్ర సీమ అవకాశాల కోసం టాలివుడ్‌లో చాన్సులను పణంగా పెట్టబోనని స్పష్టం చేస్తోంది. తెలుగులో ఆగ్రనటుల సరసన బంపర్ హిట్ కొడుతూ నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్న రకుల్ తెలుగు సినిమాలను వదులుకుని మరీ తమిళ చిత్రరంగాన్ని కావిలించుకునే పిచ్చి పని చేయబోనని సంకేతాలు వెలువరిస్తోంది.
 
టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఇంకా విజయాల ఖాతాను ఓపెన్‌ చేయలేక పోయింది. తాజాగా ఇక్కడ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కార్తీకి జంటగా ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా విశాల్‌కు జంటగా తుప్పరివాలన్‌ చిత్రంలో నటించడానికి సమ్మతించి ఆ తరువాత వైదొలగింది.
కాగా దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య సరసన నటించడానికి రకుల్‌ ఎంపికైంది.  తాజాగా  సెల్వరాఘవన్‌ చిత్రానికి కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. 
 
సెల్వరాఘవన్‌ ప్రస్తుతం సంతానం హీరోగా మన్నవన్‌ వందానడీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికి 35 శాతం షూటింగ్‌ మాత్రమే పూర్తి చేసుకుందని సమాచారం. చిత్రాన్ని పూర్తి చేయడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందట. అదే విధంగా నటుడు సూర్య ప్రస్తుతం విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో తానాచేర్నద కూటం చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తీసురేశ్‌ నాయకి. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని సమాచారం. దీంతో సూర్య తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. 
 
దర్శకుడు సెల్వరాఘవన్‌ కోసం సూర్యతో పాటు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి. అయితే ఆ అమ్మడికి తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయట. వాటిని వదులుకుని సెల్వరాఘవన్‌ చిత్రం కోసం ఎదురు చూసేంత సీన్‌ లేదని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments