Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో క్రైమ్‌ థ్రిల్ల‌ర్ ‘ర‌క్ష‌ణ‌’

డీవీ
సోమవారం, 13 మే 2024 (19:03 IST)
Payal Rajput
‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న సినిమా ‘ర‌క్ష‌ణ‌’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో పాయ‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు. ఈ మూవీ శ‌ర‌వేగంగా రూపొందుతోంది.
 
హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్‌. ఈ సినిమా టైటిల్  పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు పాయ‌ల్ రాజ్‌పుత్ చేసిన సినిమాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆసాంతం క‌ట్టిప‌డేయ‌నున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా పాయ‌ల్‌ మెప్పించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా...
 
ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘‘ర‌క్ష‌ణ ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు మంచి ఇమేజ్‌ను తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments