Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదం జరిగింది తరుణ్‌కి కాదు..మరి ఆ హీరో ఎవరు..?

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (16:18 IST)
టాలీవుడ్ హీరో తరుణ్‌కు రోడ్డు ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, హీరో తరుణ్ దీనిపై స్పందించి, తనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్నానని పేర్కొన్నాడు. తీరా విషయమేంటని ఆరా తీయగా ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీలో రికార్డ్ అయ్యిన కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. 
 
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌  TS09 Ex 1100 నంబర్ గల తన కారులో హైదరాబాద్ వస్తుండగా నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ దగ్గర కుడివైపు మలుపు ఉండగా, నేరుగా ఎదురుగా గోడను ఢీకొట్టడం వలన కారు కాస్త ముందుకెళ్లి ధ్వంసం అయ్యింది. ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్ అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ దృశ్యాలు పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొదట నడుచుకుంటూ వెళ్లిన రాజ్ తరుణ్ ఆ తర్వాత పరిగెత్తడం ప్రారంభించాడు. అలా వెళ్తున్నప్పుడు ఫోన్ తీసుకుని చూస్తున్నట్లు గుర్తించబడింది. అయితే అతడు ఎటువైపు వెళ్లాడు, పారిపోవాల్సిన అవసరమేంటని మాత్రం తెలియడం లేదు.

తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో నిద్రమత్తు వల్లే జరిగి ఉంటుందా లేక అతి వేగంతో కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఆ సమయంలో రాజ్ తరుణ్ మద్యం మత్తులో ఉన్నాడా అనేదానిపై ఇంకా పోలీసులు కూడా ఏమీ తేల్చలేకపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments