Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సినిమాలన్నింటికీ నేనొక ప్రేక్షకుడిని : '2.0' చిత్ర దర్శకుడు శంకర్

'నేను ఇంతకుముందు చేసిన సినిమాలకంటే బెటర్‌ సినిమా చెయ్యాలని ప్రతిసారీ ప్రయత్నిస్తుంటాను. నేను చేసే ప్రతి సినిమాకీ నేనొక ఆడియన్‌లా ఫీల్‌ అవుతాను.

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (17:14 IST)
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ అదే కాంబినేషన్‌లో సుభాష్‌ కరణ్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ '2.0'. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను ఆదివారం ముంబైలోని యశ్‌రాజ్‌ స్టూడియోలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 
 
ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, హీరో అక్షయ్‌కుమార్‌, హీరో సల్మాన్‌ఖాన్‌, డైరెక్టర్‌ శంకర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌, నిర్మాత సుభాష్‌ కరణ్‌, విఎఫ్‌ఎక్స్‌ వాల్ట్‌ జోన్స్‌, హీరోలు ఆర్య, విజయ్‌ ఆంటోనీ, సినిమాటోగ్రాఫర్‌ నిరవ్‌ షా, ఫైట్‌ మాస్టర్‌ సెల్వ, ప్రముఖ నిర్మాతలు ఎ.ఎం.రత్నం, బెల్లంకొండ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
ఇందులో చిత్ర దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. ''నేను ఇంతకుముందు చేసిన సినిమాలకంటే బెటర్‌ సినిమా చెయ్యాలని ప్రతిసారీ ప్రయత్నిస్తుంటాను. నేను చేసే ప్రతి సినిమాకీ నేనొక ఆడియన్‌లా ఫీల్‌ అవుతాను. నాలో ఉన్న ఆడియన్‌ని శాటిస్‌ఫై చెయ్యడానికి ట్రై చేస్తాను. రోబో కంటే 10 రెట్లు కష్టపడి దానికి సీక్వెల్‌ 2.0 చేస్తున్నాను. రోబో చేస్తున్నప్పుడు స్టెప్‌ బై స్టెప్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కుతున్న ఫీలింగ్‌ కలిగింది. మొత్తానికి దాన్ని రీచ్‌ అయ్యాను. ఇప్పుడు 2.0 విషయానికి వస్తే ఎవరెస్ట్‌ శిఖరాన్ని నా భుజంపై పెట్టుకొని స్టెప్‌ బై స్టెప్‌ ఎవరెస్ట్‌ని ఎక్కుతున్న ఫీలింగ్‌ కలుగుతోంది. సైన్స్‌ ఫిక్షన్‌ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌ జోనర్‌. 2.0 తర్వాత నా మైండ్‌లోకి ఇంకా కొత్త ఐడియాలు వస్తే తప్పకుండా 3.0, 4.0, 5.0 చేస్తాను'' అన్నారు. 
 
సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ మాట్లాడుతూ.. ''నేను చేసిన సినిమాల్లో ఇది టఫెస్ట్‌ మూవీ. శంకర్‌ని శాటిస్‌ఫై చెయ్యడం చాలా కష్టం. శంకర్‌తో వర్క్‌ చేయడం ఒక ఛాలెంజ్‌ లాంటిది. ఆయన ఐడియాలు చాలా హై లో వుంటాయి. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఒక యునీక్‌ ప్రొడక్ట్‌ని ప్రపంచానికి అందించాలన్నదే మా లక్ష్యం. ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్‌ పూర్తి చేయడం జరిగింది. ఇలాంటి సినిమా చేయడం ఒక ఛాలెంజ్‌లాంటిది'' అన్నారు. 
 
నిర్మాత సుభాష్‌కరణ్‌ మాట్లాడుతూ.. ''ఈ సబ్జెక్ట్‌ వినగానే తప్పకుండా ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది అన్న నమ్మకం కలిగింది. నేను ఒక సైంటిస్ట్‌ మీద డబ్బు ఖర్చు పెడుతున్నానన్న నమ్మకంతోనే ఈ సినిమా చేస్తున్నాను. ఇండియన్‌ సినిమా హిస్టరీనే మార్చే సినిమాగా 2.0 రూపొందుతోంది'' అన్నారు. 
 
విలన్ అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ''నా 25 సంవత్సరాల కెరీర్‌లో నేను ఎప్పుడూ మేకప్‌ వేసుకోలేదు. ఈ 25 సంవత్సరాల్లో నేను వేసుకోని మేకప్‌ ఈ ఒక్క సినిమాకే వేసుకున్నాను. మూడు గంటలు మేకప్‌ వేసుకోవడానికి, దాన్ని తీసెయ్యడానికి ఒక గంట టైమ్‌ పట్టేది. దీంతో నా పేషన్స్‌ లెవల్స్‌ బాగా పెరిగాయి. ఇంత గొప్ప సినిమాలో నేను కూడా ఒక పార్ట్‌ అయ్యేలా చేసిన రజనీకాంత్‌కి, శంకర్‌కి, సుభాష్‌కి థాంక్స్‌. రజినీకాంత్‌తో నటించడానికి నన్ను సెలెక్ట్‌ చేసుకున్నారని తెలిసి నేను చాలా షాక్‌ అయ్యాను. ఆయనతో కలిసి నటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను'' అన్నారు. 
 
హీరో ల్మాన్‌ఖాన్‌ మాట్లాడుతూ.. ''నేను రజనీకాంత్‌ని చూడడానికే ఇక్కడికి వచ్చాను. మోస్ట్‌ ఎమేజింగ్‌ మ్యాన్‌. ఆయనంటే నాకెంతో గౌరవం. ఈ ఫంక్షన్‌కి నాకు ఆహ్వానం లేకపోయినా ఇక్కడ 2.0 ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ జరుగుతోందని తెలుసుకొని వచ్చాను. అక్షయ్‌కుమార్‌ మోస్ట్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌. యాక్టింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే వుండే ఏకైక వ్యక్తి అక్షయ్‌కుమార్‌'' అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments