Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ నుంచి చెన్నైకు చేరుకున్న రజనీకాంత్

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (12:13 IST)
వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం క్షేమంగా చెన్నైకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో ఆయన గత నెల 19వ తేదీన అమెరికాకు వెళ్లారు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాత మాయో క్లినిక్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 
 
అక్కడ ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. దాదాపు 20 రోజుల తర్వాత రజనీకాంత్ చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రజనీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. 
 
మరోవైపు ప్రస్తుతం రజనీ 'అన్నాత్తే' సినిమాలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 
ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, నయనతార, కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు నటుడు సత్యదేవ్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రజనీ చేయబోయే చిత్రానికి ఆయన కూతురు సౌందర్య దర్శకత్వం వహించనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments