Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధం.. యుద్ధం అంటూ బోర్ కొట్టిస్తున్న రజనీకాంత్ : నటి కస్తూరి కామెంట్స్

రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్న మీమాంశలో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సినీ నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది. రజనీ.. పోరు, పోరు (యుద్ధం) అంటున్న మీ మాటలు విని బోర్‌ కొడుతోంది స్వామీ.. రాజకీ

Webdunia
ఆదివారం, 21 మే 2017 (10:21 IST)
రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్న మీమాంశలో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సినీ నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది. రజనీ.. పోరు, పోరు (యుద్ధం) అంటున్న మీ మాటలు విని బోర్‌ కొడుతోంది స్వామీ.. రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేయకుండా పోరు వచ్చినప్పుడు చూసుకుందామంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్ చేస్తున్న ప్రకటనలు బోర్‌ కొడుతున్నాయి. అనిశ్చితి పరిస్థితిలోనూ స్థిరమైన నిర్ణయాన్ని తక్షణం తీసుకునేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. రజనీకాంత్ కూడా ఏదో ఒక స్థిరమైన నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలి అంటూ సినీ నటి కస్తూరి వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆమె ట్వీట్ చేస్తూ.. రజనీ నాన్చుడు ధోరణి విరక్తి కలిగిస్తోంది. ఐదేళ్లుగా అభిమానులను కలుసుకుంటున్న ఆయన యుద్ధం.. యుద్ధం అంటూ బోరో కొట్టిస్తున్నారని (పోర్.. పోర్.. రజనీ బోర్) వ్యాఖ్యానించింది. రాజకీయ అరంగేట్రానికి ధైర్యం కావాలని పేర్కొంది. రాజకీయ ప్రవేశంపై రజనీ ఏళ్ల తరబడి ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేసింది. ఈ
 
కాగా, కస్తూరి వ్యాఖ్యలపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. ‘‘నీవు కూడా రజనీ గురించి మాట్లాడుతున్నావా?.. టైమ్.. ఏం చేస్తాం.. నోరు మూసుకో’’ అంటూ ఓ అభిమాని ఘాటుగా కౌంటరిచ్చాడు. దీనికి కస్తూరి కూడా అంతే ఘాటుగా స్పందించింది. ‘‘నీవు పుట్టక ముందు నుంచే నేను రజనీ అభిమానిని. నీలాంటి మర్యాదలేని అభిమానుల వల్ల రజనీకి చెడ్డపేరు, అవమానం. ముందు నీ నోరు మూసుకో’’ అని చెంప చెళ్లుమనేలా బదులిచ్చింది. 
 
‘‘సినిమాల్లో ఉండి రజనీని విమర్శిస్తావా.. ఎంత అమర్యాద!’’ అన్న మరో వీరాభిమాని కామెంట్‌కు కస్తూరి స్పందిస్తూ తాను చేసింది విమర్శలు కావని, విరక్తితోనే అలా అన్నానని, ఇదే అభిప్రాయం అందిరిలోనూ ఉందని, కాకపోతే తాను బయటపెట్టానని పేర్కొంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన

Hyderabad rains: టీజీఎస్సార్టీసీ ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్ నుంచి బ‌స్సుల రాకపోకల్లో మార్పులు (video)

రెండు కాళ్లు పైకెత్తి పందిని కొట్టినట్లు కొట్టారు: RRR గురించి కామినేని వ్యాఖ్యలు వైరల్ (video)

Musi: తెలంగాణలో భారీ వర్షాలు - మూసీ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తేస్తే పరిస్థితి?

Lord Vitthal snake: పాము దర్శనంలో విట్టల్ దర్శనం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments