Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదుల అనుసంధానానికి కబాలి కోటి విరాళం: యూఎస్‌లో చికిత్స.. త్వరలో ఇండియాకు!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నదుల అనుసంధానానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో రజనీ సోదరుడు సత్యనారాయణ ప

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (09:20 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నదుల అనుసంధానానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో రజనీ సోదరుడు సత్యనారాయణ పూజలు నిర్వహించారు.

దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు ఇచ్చిన పిలుపునకు రజనీకాంత్ స్పందిస్తూ.. ఈ ప్రక్రియకు తన వంతు సాయం చేస్తానని ప్రకటించారు. అంతేగాకుండా నదుల అనుసంధానానికి రూ.కోటి డిపాజిట్ చేశారని సత్యనారాయణ తెలిపారు. 
 
ఇటీవల గంగా-కావేరి నదుల అనుసంధానానికి రజనీకాంత్ సాయం చేయాల్సిందిగా రైతు సంఘాల సమాఖ్య నాయకులు కోరిన తరుణంలో ఆయన కోటి విరాళాన్ని అందజేసినట్లు రజనీ సోదరుడు సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు ప్రకటించారు.

నదుల అనుసంధాన ప్రక్రియ పనులు ప్రారంభమైన వెంటనే ఆ నగదును సంబంధిత అధికారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని సత్యనారాయణ చెప్పుకొచ్చారు. కబాలి రిలీజ్‌కు ముందు రజనీకాంత్ భారత్‌కు వస్తారని సత్యనారాయణ ప్రకటించారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments