Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీ పుట్టిన రోజు - ఆ విషయంపై క్లారిటీ వస్తుందా..?

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు రేపు జరుగనుంది. తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రజినీ పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. రక్తదానాలు, అన్నదానాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చే

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (21:45 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు రేపు జరుగనుంది. తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రజినీ పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. రక్తదానాలు, అన్నదానాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసేసుకున్నారు. అయితే అభిమానులు మాత్రం రజినీ నోట నుంచి ఒకమాట వినేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. రేపు జరిగే పుట్టిన రోజు వేడుకల్లో రజినీ తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తారన్న ఆశతో ఉన్నారు అభిమానులు. 
 
ఇప్పుడు..అప్పుడు అంటూ అభిమానులను సందిగ్థంలో నెట్టి రాజకీయాల్లోకి రాకుండా ఆలోచనలో పడ్డారు రజినీకాంత్. రజినీ పుట్టినరోజుకు ఖచ్చితంగా రాజకీయప్రకటన వస్తుందని అందరూ భావిస్తున్నారు. గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాగే అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఎంతోమంది సలహాలు ఇచ్చినా, స్వయంగా రజినీనే అభిమానులను కలిసినా ఆయన మాత్రం రాజకీయ రంగప్రవేశంపై ప్రకటన చేయలేదు.
 
కానీ రేపు జరిగే పుట్టినరోజు వేడుకల్లో తాను ఎప్పుడూ రాజకీయాల్లోకి వస్తున్నానన్న విషయాన్ని రజినీ ప్రకటించే అవకాశం ఉందన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇప్పటికే రజినీ తమ్ముడు సత్యనారాయణ కూడా రజినీ రాజకీయాల్లోకి వస్తారని అది పుట్టినరోజా లేకుంటే కొత్త సంవత్సరమా అన్నది మాత్రం తేలాల్సి ఉందని మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలనే పట్టుకున్నారు అభిమానులు. ఎలాగైనా తలైవా తన నిర్ణయాన్ని మార్చుకుని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. రజినీ రేపు ఎలాంటి ప్రకటన చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments