Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప పెద్ద దర్గాలో రజనీకాంత్ - ఏఆర్ రెహ్మాన్

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత కడప పెద్ద దర్గా (ఆమీన్ పీర్ దర్గా)లో సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌లు గురువారం ప్రత్యక్షమయ్యారు. తిరుమల పర్యటనకు వెళ్లిన రజనీకాంత్.. గురువారం వేకువజామున శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. అక్కడ నుంచి ఆయన కడపకు చేరుకున్నారు. అక్కడ ఏఆర్ రెహ్మాన్‌తో కలిసి పెద్ద దర్గాను దర్శనం చేసుకున్నారు. 
 
అంతకుముందు గురువారం ఉదయం రజనీకాంత్, తన కుమార్తె ఆశ్వర్యతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వారు ప్రత్యేక క్యూలైన్ నుంచి వెళ్లేలా తితిదే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్బంగా రజనీకాంత్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. 
 
ఈ నెల 12వ తేదీన రజనీకాంత్ తన 72వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న విషయం తెల్సిందే. ఆ రోజున ఆయన చెన్నైలో లేరు కూడా. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికి తిరుమలకు చేరుకున్న రజనీకాంత్ గురువారం శ్రీవారి దర్శనం చేసుుకని అక్కడ నుంచి కడపకు చేరుకున్నారు. 
 
రజనీకాంత్, ఏఆర్ రెహ్మాన్‌లు అమీన్ పీర్ దర్గా దర్శనం కోసం వస్తుండటంత జిల్లా యంత్రాంతం తగిన ఏర్పాట్లుచేసింది. కాగా, ఐశ్వర్య దర్శకత్వం వహించే కొత్త చిత్రం లాల్ సలామ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒంటరిగా వెళ్లే మహిళలే టార్గెట్.. తిరుమలలో మత్తు మందిచ్చి దోచేసుకున్నారు..

4 రోజులు - 3 రాత్రులు... బెంగుళూరు టూరిజం - ట్రాఫిక్ జామ్‌పై పాయ్ వ్యంగ్య ట్వీట్

లేడీస్ లిక్కర్ పార్టీలు: ఈ నగరాలకు ఏమవుతోంది?

కన్యత్వాన్ని వేలానికి పెట్టిన యువతి: రూ. 18 కోట్లకు దక్కించుకున్న నటుడు

Python- ఖమ్మం జిల్లాలో రోడ్డుపై కనిపించిన కొండ చిలువ.. వాహనదారులు ఏం చేశారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments