Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-12-2017: రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారు..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజz అరంగేట్రానికి ముహూర్తం ఖరారైపోయిందా? అంటే అవునంటున్నాయి.. కోలీవుడ్ వర్గాలు. తమిళనాట రాజకీయాలు అంతంత మాత్రంగానే ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే మంచి తరుణమని రజనీకా

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (13:00 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజz అరంగేట్రానికి ముహూర్తం ఖరారైపోయిందా? అంటే అవునంటున్నాయి.. కోలీవుడ్ వర్గాలు. తమిళనాట రాజకీయాలు అంతంత మాత్రంగానే ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే మంచి తరుణమని రజనీకాంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. 
 
రజనీ రాజకీయాల్లో రావడంపై స్థానికతను సాకుగా చూపుతూ.. భారతీ రాజావంటి ప్రముఖ దర్శకులు కామెంట్లు చేసినా.. వాటిని పక్కనబెట్టి ప్రజా సేవకు స్థానికతకు సంబంధం లేదని రజనీకాంత్ రుజువు చేస్తారని తలైవా ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే సినీ లెజెండ్ కమల్ హాసన్‌కు కూడా తలైవా ఫ్యాన్స్ చురకలంటిస్తున్నారు. కెమెరా ముందు నిలబడాలనే తాపత్రయం తమ నాయకుడికి లేదని.. రాజకీయాల్లోకి రావడంపై ఎందరూ ఒత్తిడి తెచ్చినా ఆయన కెమెరా ముందుకొచ్చి చెప్పలేదనే విషయాన్ని గుర్తు చేశారు. 
 
ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఇటీవల ఫ్యాన్స్‌ను కలిసిన సందర్భంగా "దేవుడు ఆదేశిస్తే.. రాజకీయాల్లో వస్తానని" ప్రకటించారు. ఇంకా ప్రముఖులతో తమిళ రాజకీయాలపై పరిశీలన చేస్తున్న రజనీకాంత్.. పార్టీ జెండా, పేరును కూడా ఖరారు చేసినట్లు సమాచారం. 
 
ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ తన పుట్టిన రోజైన డిసెంబర్ 12వ తేదీ రాజకీయాలపై ప్రకటన చేస్తారని కోలీవుడ్‌లో టాక్ వస్తోంది. ప్రస్తుతం కాల సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న రజనీకాంత్.. ఈ షూటింగ్‌ను పూర్తి చేసుకుని.. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు సినీ జనం అనుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments