Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

సెల్వి
సోమవారం, 24 మార్చి 2025 (12:42 IST)
Rajendra Prasad
టాలీవుడ్ స్టార్ నితిన్ రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరయ్యారు. ఆయన రాకతో ఈవెంట్ మరింత సందడిగా మారింది. అయితే ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ స్పీచ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజేంద్ర ప్రసాద్ రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. డేవిడ్ వార్నర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశాడు. 
 
ఈ సినిమాలో నితిన్, శ్రీలీలా, దర్శకుడు వెంకీ కుడుముల మంచి హార్డ్ వర్క్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 'రాబిన్ హుడ్'లో స్పెషల్ రోల్‌లో నటించిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి కూడా మాట్లాడారు. ప్రపంచమంత అభిమానులను సంపాధించుకున్న ఆయన్ని పచ్చిబూతులు తిట్టారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "ఓరే డేవిడ్ వార్నరూ.. నువ్వు మాములోడివి కాదురోయ్.." అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
అది విన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడటం సరికాదని భావిస్తున్నారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాగి ఇలా మాట్లాడారని.. అందుకే నోరు జారారని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇక నుంచి సిని ఫంక్షన్లలో మాట్లాడే వాళ్లకు ముందు ఏం మాట్లాడుతున్నారో ఆర్గనైజర్లకు చెప్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. లేకుంటే గతంలో పృథ్వీ, ప్రస్తుతం రాజేంద్రప్రసాద్‌లాంటి వారి నోటి దూలకు కళ్లెం వేయలేమని నెటిజన్లు అంటున్నారు.

ఇంకా రాజేంద్ర ప్రసాద్‌పై డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ అతి ఉత్సాహంతో డేవిడ్ వార్నర్‌ను పొగుడుదామనుకున్నారు. అందుకే డేవిడ్ వార్నర్ గతంలో క్రికెట్ స్టేడియంలో చేసిన పుష్ప సిగ్నేచర్ స్టెప్‌ను గుర్తు చేస్తూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అది తప్పుగా వెళ్లింది. అసలు రాజేంద్ర ప్రసాద్ కావాలని అని ఉంటాడా? లేకా తొందరలో అలా స్టార్ క్రికెటర్‌పై మాటలు జారారా? అనే చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments