Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌శేఖ‌ర్ కొత్త సినిమా ఖ‌రారు.. ఇంత‌కీ.. ఏ త‌ర‌హా చిత్రం..?

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:50 IST)
టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరైన డా.రాజశేఖర్ కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డా. జి.ధనుంజయన్ నిర్మిస్తున్నారు. సింగిల్ లైన్ కథ వినగానే ఎగ్జైట్ అయిన రాజశేఖర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. 
 
ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవల విడుదలైన 'కిల్లర్' సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్. కె. కింగ్   డా. రాజశేఖర్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. తెలుగు 'క్షణం' ను శిబిరాజ్ తో 'సత్య'గా తీయటంతో పాటు 'బేతాళుడు'  సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టనున్నారు. హీరోయిన్‌తో పాటు మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారు.
 
సినిమా టైటిల్ నిర్ణయించి త్వరలో షూటింగ్ మొదలు పెడతామని నిర్మాత జి. ధనుంజయన్ చెబుతున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసి మార్చి 2020లో సినిమాను విడుదల చేస్తామంటున్నారు ధనుంజయన్. సింగిల్ సిట్టింగ్‌లో కథను ఓకే చేసి వెంటనే షూటింగ్ మొదలు పెడదామన్న డా. రాజశేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత ధనుంజయన్. 
 
తమిళంలో రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత డా. జి. ధనుంజన్. సమంత అక్కినేని నటించిన 'యు టర్న్' సినిమాతో పాటు, విజయ్ ఆంటోని 'కొలైకారన్'ను తమిళంలో విడుదల చేశారు ధనుంజయన్. ఇటీవల మురళీ కార్తీక్, గౌతమ్ కార్తీక్, రెజీనాతో తిరు దర్శకత్వంలో 'మిస్టర్ చంద్రమౌళి' సినిమాతో పాటు జ్యోతిక, లక్ష్మీ మంచుతో రాధామోహన్ దర్శకత్వంలో 'కాట్రిన్ మొళి' సినిమాను నిర్మించారు. తాజాగా విజయ్ ఆంటోనీతో రెండు వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు. డా. రాజశేఖర్ సినిమాతో తెలుగు చిత్రరంగంలోకి అడుగు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments