Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ వేగతో రాజశేఖర్ ఆర్థికంగా నిలదొక్కుకుంటారా? తాకట్టును విడిపించుకుంటారా?

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్‌గా పేరు కొట్టేసిన రాజశేఖర్.. పలు హిట్ సినిమాలకు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ క్రమక్రమంగా రాజశేఖర్ మార్కెట్ చాలా తగ్గిపోయింది. దాదాపు హీరోగా ఇక కెరీర్ ముగిసిందనుకున్న సమయంలో

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (15:48 IST)
టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్‌గా పేరు కొట్టేసిన రాజశేఖర్.. పలు హిట్ సినిమాలకు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ క్రమక్రమంగా రాజశేఖర్ మార్కెట్ చాలా తగ్గిపోయింది. దాదాపు హీరోగా ఇక కెరీర్ ముగిసిందనుకున్న సమయంలో  పీఎస్వీ గరుడవేగతో ఒక్కసారి సూపర్ సక్సెస్ అందుకున్నాడు రాజశేఖర్. అయితే ఈ సినిమా కలెక్షన్లతో రాజశేఖర్ కష్టాలు తీరవని టాక్. అమెరికా మార్కెట్ మినహా టాలీవుడ్‌లో పెద్దగా గరుడ వేగకు వసూళ్లు లేవని సమాచారం. 
 
రాజశేఖర్ గరుడ వేగ మూవీకి యూఎస్‌లో అద్భుతమైన స్పందన లభించింది. గత గురువారం నాడు ప్రీమియర్లతో 28వేల డాలర్లు రాబట్టగా.. శుక్రవారం నాడు 64వేల డాలర్లకు వసూళ్లు పెరిగాయి. శనివారం నాడు అయితే ఏకంగా 106వేల డాలర్లు రావడం విశేషం. ఆదివారం కూడా జోరు చూపించిన ఈ చిత్రం 60వేల డాలర్లను రాబట్టి.. మొత్తంగా వసూళ్లను 2.62 లక్షల డాలర్లకు పెంచుకుంది. 
 
నిజానికి పెద్దగా అంచనాలు లేని ‘గరుడవేగ' సినిమా యుఎస్ హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ఇచ్చేశారు. ఆ మొత్తం రూ.36 లక్షలని సమాచారం. అయితే అమెరికా వసూళ్లతో లాభాలు రావని సినీ యూనిట్ భావిస్తోంది. టాలీవుడ్‌లోనూ  సినిమాకు వసూళ్లు రావాలని అప్పుడే నిలదొక్కుకోగలమని.. అప్పుడే రాజశేఖర్ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోగలరని సమాచారం.
 
మొదటి వీకెండ్‌లో మూడు కోట్ల అరవై లక్షల షేర్‌ మాత్రమే రావడంతో థియేట్రికల్‌ రికవరీకి మరో ఎనిమిది కోట్ల వరకు అవసరం. కానీ వసూళ్ల పరంగా ఈ చిత్రం స్లోగా వుంది. థియేటర్ల పరంగా పట్టు లేకపోవడం ఈ చిత్రానికి ఇబ్బందిగా మారిందట. దీంతో నష్టాలు రాకుండా పెట్టిన పెట్టుబడి వసూలైపోతే బాగుంటుందని సినీ యూనిట్ భావిస్తోంది. ఆస్తినంతా తాకట్టు పెట్టి ఈ సినిమా బతికించుకున్న రాజశేఖర్‌కు గరుడ వేగ మంచి కలెక్షన్లు ఇస్తే కష్టాలన్నీ తీరిపోతాయని.. సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
 
ఇప్పటికే హైదరాబాదులో జరిగిన గరుడ వేగ సక్సెస్ మీట్‌లో రాజశేఖర్ మాట్లాడుతూ, గరుడ వేగకు అనూహ్య స్పందన వస్తుందని.. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నానని.. పొగుడుతూ తనకు ఫోన్ కాల్స్ వస్తూనే వున్నాయని.. ఫోన్ రింగ్ అవుతూనే వుందన్నారు. కాగా వచ్చే ఏడాది రాజశేఖర్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

Telangana Crime: ప్రేమిస్తానని చెప్పాడు.. కానీ పెళ్లికి ముందే వరకట్నం కోసం వేధించాడు... ఆ యువతి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments