Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా పిచ్చి ఉన్నోళ్ల ధూల తీర్చేసిన రాజమౌళీ హ్యాట్సాఫ్: కడుపు నిండిన ప్రేక్షకుల హర్షం

బాహుబలి2 సినిమాను థియేటర్లో చూస్తున్న వారికి పిచ్చెక్కించడమే కాదు... సినిమా పిచ్చి ఉన్నోళ్లందరి ధూల తీర్చేసిన రాజమౌళీ హ్యాట్సాప్ అంటున్నారు ప్రేక్షకులు. థియేటర్ నుంచి బయటకు వస్తున్న వారి కళ్లలో ఆనందం, కడుపు నిండిన ఫీలింగ్, తొలిభాగంలో సంధించిన ఎన్నో ప

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (09:16 IST)
బాహుబలి2 సినిమాను థియేటర్లో చూస్తున్న వారికి పిచ్చెక్కించడమే కాదు... సినిమా పిచ్చి ఉన్నోళ్లందరి ధూల తీర్చేసిన రాజమౌళీ హ్యాట్సాప్ అంటున్నారు ప్రేక్షకులు. థియేటర్ నుంచి బయటకు వస్తున్న వారి కళ్లలో ఆనందం, కడుపు నిండిన ఫీలింగ్, తొలిభాగంలో సంధించిన ఎన్నో ప్రశ్నలకు పూర్తి సమాధానాలు అందిన సంతృప్తి. జన్మ సార్థకమైన అనుభూతి. మా ఆపీసునుంచి గురువారం రాత్రి హాఫ్ డే లీవు పెట్టి మరీ బాహుబలి 2 చూసివచ్చిన మా కొల్గీగ్ ఇప్పటికీ అదే ఫీలింగుతో ఉన్నారు.
 
బాహుబలి 2 తొలి సగం చూసేటప్పటికే తనకు పిచ్చెత్తి పోతోందని చెప్పిన మా మిత్రుడు దయచేసి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని అడగొద్దని దాన్ని ఒక ముక్కలో చెప్పడం సాధ్యం కాదని ముందే విన్నా మీరు సినిమా చూసేటప్పుడు కలిగే అనుభూతి వేరని, కథ ముందే వినకుండానే థియేటర్‌కు వెళ్లి ఈ ప్రశ్నకు సమాధానం మీ కళ్లతో మీరే చూడండని చెబుతున్నారు. 
 
బాహుబలి ది బిగినంగ్ ఎంత చక్కగా ఎక్కడా విసుగెత్తించకుండా సాగిపోయిందో అంతకుమంచిన చక్కదనంతోనే బాహుబలి 2 కూడా తయారైందని. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమామీద పిచ్చి ఉన్నవాళ్లందరి ధూల తీర్చేశాడు రాజమౌళి అంటూ పొగుడుతున్నారు. 
 
థియేటర్ బయటకు రాగానే మైక్ పెట్టి అడుగుతున్నవాళ్లకు కూడా తాను ఇదే సమాధానం చెప్పారట. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెపితే వెంటనే మా వాళ్లందరికీ చెప్పాలి అని ఒకరు థియేటర్ బయట పట్టుకున్నారట. తను నాలుగు ముక్కలు చెబితే అర్థం కాలే అన్నాడట. అదే గదా నేను చెప్పేది కూడా. బయట వినొద్దు, థియేటర్ లోపలికి వెళ్లి చూడు అప్పుడే  అర్థమవుతుంది అని వచ్చేశాడు మా మిత్రుడు. గంటసేపు సినిమా నడిపిన తర్వాత రాజమౌళి కట్టప్ప బాహుబలిని చంపిన సన్నివేశం వద్దకు కథను తీసుకొచ్చాడని ఆ గంట సినిమా చూడకుండా కట్టప్పను అర్థం చేసుకోవడం కష్టమని తాను చెబుతున్నారు. 
 
రెండో భాగం మొత్తం నలుగురితో నడుస్తుందట. ప్రభాస్, అనుష్క, కట్టప్ప, నాజర్. వీరి చుట్టూనే కథ నడిచిందట. భల్లాల దేవుడికి కూడా డైలాగుు తక్కువ ఉన్నాయని,. ఇక తమన్నా అయితే చివరి యుద్ధం సీనులో కాస్సేప కనపడి కనుమరుగైపోతుందని అంటున్నారు. మొత్తం మీద పైరసీ కాపీని కాని, మరొకరి ద్వారా విని కానీ సినిమా కథ తెలుసుకోవద్దని స్వయంగా చూస్తే కానీ ఆ అనుభూతి ఎవరికీ కలగదని చెప్పారు. 
 
ఏనుగు పైనుంచి ప్రభాస్ బాణం సంధించడం కానీ, ప్రభాస్, అనుష్క ప్రయాణిస్తున్న పడవ ఉన్నట్లుండి పైకి ఎగిరి మల్లీ కిందకు రావడం కాని యుద్ద సన్నివేశాలు కానీ అనుష్క నటన కాని మరిచిపోలేని అనుభూతిని అందిస్తాయని అంటున్న మా కొల్లీగ్ సినిమా చూస్తే మీ దూల కూడా తీరిపోవడం ఖాయం అని ఊరిస్తూనే ఉన్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments