Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుతో బాహుబలి జక్కన్న సినిమా: ప్రిన్స్ ఎప్పుడో సైన్ చేశారట!

Webdunia
ఆదివారం, 5 జులై 2015 (12:31 IST)
బాహుబలి సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్న రాజమౌళి త్వరలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బాహుబలి తొలి పార్ట్ జూలై పదో తేదీన రిలీజ్ కానుంది.

రెండో పార్ట్ పనుల్ని కూడా త్వరగా ముగించుకుని మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రాజమౌళి రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు ఒప్పందం ఎప్పుడో కుదిరిందని, మహేష్ బాబు ఈ సినిమా కోసం సంతకం కూడా చేసేశారని, కెఎల్ నారాయణ ఈ మూవీకి నిర్మాణ సారథ్యం వహించే ఛాన్సుందని సమాచారం.
 
బాహుబలి పార్ట్ టూ పనులన్నీ ఈ ఏడాదిలోపు పూర్తి చేసుకునే జక్కన్న.. వచ్చే ఏడాది మహేష్ బాబుతో సినిమా చేస్తారని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఇంకేముంది.. అందుకే కాబోలు మహేష్ బాబు బాహుబలి సినిమాకు రూటిస్తూ.. తన సినిమా శ్రీమంతుడును వాయిదా వేసుకున్నారని సినీ జనం అనుకుంటున్నారు. ఇంకా రాజమౌళితో ప్రిన్స్ సినిమా తప్పకుండా అదిరిపోతుందని మహేష్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments