Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి జన్మ ధన్యం: ‘బాహుబలి-2’ తొలి ప్రేక్షకురాలు క్వీన్ ఎలిజబెత్ -2

ఏ నోట విన్నా ‘బాహుబలి-2’ మాటలే. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి అనడం అతిశయోక్తి కాదు. చివరికి ప్రధాన మంత్రి, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కూడా దీనికోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఓ తెలుగువాడు ఇంతటి ఘనత సాధించడం ప్రశంసనీయం.

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (08:38 IST)
ఏ నోట విన్నా ‘బాహుబలి-2’ మాటలే. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి అనడం అతిశయోక్తి కాదు. చివరికి ప్రధాన మంత్రి, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కూడా దీనికోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఓ తెలుగువాడు ఇంతటి ఘనత సాధించడం ప్రశంసనీయం.

 
ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి - ది కంక్లూజన్’ పట్ల సినీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఏప్రిల్ 28 ఎంత తొందరగా వస్తుందా... అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో సినిమాలను ఆదరించే కళాభిమానులంతా ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ నటించిన ‘బాహుబలి’ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే వీరందరిలో ఈ సినిమాను మొట్టమొదట చూసేది ఎవరో తెలిస్తే ఆశ్చర్యంతో పాటు తెలుగువాళ్ళంతా, ఆ మాటకొస్తే భారతీయులంతా గర్వపడవచ్చు. ఈ సినిమాకు మొదటి ప్రేక్షకురాలు బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 అని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు.
 
బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏప్రిల్ 24 నుంచి నిర్వహిస్తున్న ‘ఇండియా ఆన్ ఫిల్మ్స్’ కార్యక్రమంలో ‘బాహుబలి - ది కంక్లూజన్‌’ను ప్రదర్శిస్తారని సమాచారం. ఈ సినిమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి క్వీన్ ఎలిజబెత్ -2 చూస్తారని తెలుస్తోంది.
 
హైదరాబాద్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘బాహుబలి 2’ చిత్రం ప్రీమియర్‌ షోను ముందుగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 వీక్షించనున్నారట. స్వతంత్ర భారతదేశం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్‌ 24న బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘ఇండియా ఆన్‌ ఫిల్మ్‌’ కార్యక్రమంలో పలు భారత సినిమాలను ప్రదర్శించనుంది. ఇందులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ షోకు క్వీన్‌ ఎలిజబెత్‌-2, ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 
2015లో విడుదలైన ‘బాహుబలి ది బిగినింగ్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును పొందింది. దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాలలో భూప్రకంపనలు: ఇలాంటి ఘటనల తర్వాత మన ఇళ్లు ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?

మైనర్ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం...

నెల్లూరు రేషన్ బియ్యం స్వాధీనం.. స్టెల్లాలో అధికారుల తనిఖీలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments