Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్స్, థ్రిల్లర్,మిస్టరీగా రహస్య

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (18:06 IST)
Rahasya prerelease
ఒక మంచం నుండి స్టార్ట్ అయిన మనం పుట్టుక చివరికి మన చావుతో ఒక మంచం పైనే ముగుస్తుంది. ఇలా ప్రతి మనిషి జీవితంలో మంచం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఒక మానవ జీవితంలో మనిషికి, మంచానికి ఉన్న రహస్య సంబంధం ఏమిటి ? అనే సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రమే "రహస్య". SSS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి.S ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు ,గ్లిమ్స్ కు, పాటలకు, టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మీలో ఒకడు హీరో కుప్పిలి  శ్రీనివాస్, హే బుజ్జి హీరో సతీష్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 
 
చిత్ర హీరో నివాస్ మాట్లాడుతూ... చాలా మందికి యాక్టింగ్ చేయాలనే డ్రీమ్ ఉన్నా సరే అది ఒక్కొక్క సారి జరగక పోవచ్చు. అయితే కెనడా లో ఉన్న నా దగ్గరకు ఈ కథ రావడం ఇందులో హీరోగా విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారికగా నటించడం చూస్తుంటే చాలా అదృష్టంగా బావిస్తున్నాను. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీని, కథను దర్శకుడు అనుకున్నట్లే చాలా బాగా తీశాడు. డైరెక్షన్ టీం  అంతా చాలా కష్టపడ్డారు. నిర్మాతలు ఈ సినిమా బాగా రావాలని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులోని సాంగ్స్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సునీల్ కశ్యప్ గారు తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మా సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పవచ్చు. చంద్ర కిరణ్, ఉద్దవ్ లు కూడా సినిమా బెస్ట్ రావడానికి చాలా హానెస్ట్ గా వర్క్ చేశారు. హీరోయిన్ సారా చాలా చక్కటి నటనను కనబరచింది..ఇలా ప్రతి ఒక్కరు కష్టపడి చేయడం వలనే సినిమా బాగా వచ్చింది. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న  ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
 నటుడు కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక మంచానికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే ఈ నెల 9వ తేదీ వరకు వెయిట్ చేసి థియేటర్స్ లలో చూడండి. చూస్తున్న ప్రతి మనిషిని థ్రిల్ కు గురి చేసేలా దర్శకుడు చాలా బాగా తెరకెక్కించడమే కాకుండా నిర్మాతలకు భారం కాకుండా తీసిన ప్రతి షార్ట్ లోనూ వేస్టేజ్ లేకుండా తీశాడని తెలిసింది. చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ చేశాడు. హీరో నివాస్ ప్రతి ఫ్రెమ్ లో చాలా  చక్కగా నటించాడు. నిర్మాతలు ప్రతి క్షణం ఈ సినిమా బాగా రావాలని తపనపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9 న వస్తున్న థ్రిల్లర్ మూవీ "రహస్య" చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
 చిత్ర డైరెక్టర్ శివశ్రీ మీగడ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి దానికి ఒక రహస్యం ఉంటుంది. అలాగే మనం పుట్టుక దగ్గర నుంచి చనిపోయే వరకు మనకు మంచం ప్రధాన పాత్రపోసిస్తుంది. అయితే మనం వాడే ప్రతి మంచానికి మనిషికి ఉన్నటువంటి రహస్యమైన అభినవబావ సంబంధం ఏమిటీ అనే వేదాంత దొరణిలో రాసుకున్న కథే ఈ "రహస్య". నేను స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకున్నా దాన్ని తెరపైకి తీసుకువచ్చే నిర్మాతలు ముందుకు రావాలి. అయితే నేను ఈ కథను నిర్మాతలకు చెప్పిన వెంటనే వారికి ఈ కథ  కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. డి .ఓ. పి సెల్వ కుమార్ ప్రతి ఫ్రెమ్ ను పెయింటింగ్ లా చాలా చక్కగా తీశారు. డ్యాన్స్ మాస్టర్ చంద్ర కిరణ్ హీరో హీరోయిన్స్ తో చాలా బాగా డ్యాన్స్ చేయించాడు. ఇందులో NIA అధికారి పాత్రలో నటిస్తున్న నివాస్ ఈ చిత్రంలోని రహస్యాన్ని ఎలా చేదించాడు   అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 9 న థియేటర్స్ లలో విడుదల అవుతున్న మా సినిమాను చూసి  చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ మాట్లాడుతూ.. డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుంది. చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు, నటీ నటులు టెక్నిషియన్స్ అందరూ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేశారు. మాకు సినిమా ఫీల్డ్ కొత్త అయినా టీం అంతా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరిని సస్పెన్స్ కు గురి చేస్తుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments