Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య నటించిన జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌ పూర్తి

Webdunia
సోమవారం, 3 జులై 2023 (16:57 IST)
Lawrence, SJ Surya
ద‌ర్శ‌క నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ష‌న్‌లో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై కార్తికేయ‌న్ నిర్మిస్తోన్న చిత్రం ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’. రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హై యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో దీపావ‌ళికి గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
 
‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’మూవీ అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. అందుకు కార‌ణం.. 2014లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన జిగ‌ర్ తండా చిత్రానికి ఇది ప్రీక్వెల్‌. సినిమా ఎలా ఉండ‌బోతుందోనిన అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ ‘‘‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ మూవీ షూటింగ్ అంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జింగ్ తండాకు ప్రీక్వెల్‌గా రాబోతున్న ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ను ఈ దీపావ‌ళికి తెలుగు, త‌మిళ‌, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. జిగ‌ర్ తండాను మించిన ఎగ్జ‌యిట్‌మెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి.  ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.
 
స్టోన్ బెంచ్ ఫిలింస్ అధినేత కార్తికేయ‌న్ సంతానం మాట్లాడుతూ ‘‘‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ హై యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోంది. అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేశాం. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. దీపావ‌ళికి  భారీ ఎత్తున తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నాం’’ అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు-రేవంతన్నల భేటీ.. ఆ స్కీమ్‌పై చర్చ.. కారు వరకు వచ్చి సాగనంపారు.. (video)

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. సీపీఐ నారాయణ డిమాండ్

ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య- పా.రంజిత్ భావోద్వేగం.. షాక్ నుంచి తేరుకోని చెన్నై (video)

ప్రపంచ క్షమాపణ దినోత్సవం 2024.. క్షమించమని అడిగితే తప్పేలేదు!!

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.. డార్క్ చాక్లెట్ తింటే మేలే.. కానీ ఎక్కువగా తీసుకుంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments