Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘవ లారెన్స్ చిత్రం రుద్రుడు రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌

Webdunia
సోమవారం, 4 జులై 2022 (09:35 IST)
Rudrudu look
నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ 'రుద్రుడు'. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 2022 క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. డిసెంబర్ 23న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంధర్భంగా విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో లారెన్స్ లుక్ ఇంటరెస్టింగ్ గా వుంది. వైన్ బాటిల్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ టెర్రిఫిక్ గా వుంది. 
 
'ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్' అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి కూడా భారీ స్పందన వచ్చింది. శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.
తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు
 
సాంకేతిక విభాగం: దర్శకత్వం - కతిరేశన్,  నిర్మాత- కతిరేశన్,  బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్,  డీవోపీ : ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి,  ఎడిటర్: ఆంథోనీ,  స్టంట్స్: శివ - విక్కీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments