Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగ‌ల 24 గంట‌ల్లో సెన్సార్ టాక్ ఏంటి..?

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (17:44 IST)
సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం `రాగల 24 గంటల్లో`. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పైన `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 15న విడుద‌ల చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ - ``సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. న‌వంబ‌ర్ 15న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. నన్ను నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కష్టపడి పని చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా నిర్మాత శ్రీనివాస్ కానూరు మంచి అభిరుచిగల నిర్మాత. ప్యాషన్‌తో ఈ సినిమాని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. 
 
కెమెరా, మ్యూజిక్ ఈ సినిమాకి రెండు కళ్ళు. అంజి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. రఘు అద్భుతమైన పాటలు, రీ-రికార్డింగ్ చేశాడు. కృష్ణభగవాన్ స్క్రిప్ట్ నచ్చి మనసు పెట్టి మంచి డైలాగ్స్ రాశారు. సినిమా అన్ని వ‌ర్గాల‌ను మెప్పించేలా ఉంటుంది`` అన్నారు.
 
నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ - ``సినిమాలపై ఉన్న ఆస‌క్తితో ఈ రంగంలోకి అడుగు పెట్టాను. న‌వంబ‌ర్ 15న‌ `రాగ‌ల 24 గంట‌ల్లో` వంటి మంచి సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను తొలి చిత్రంగా ప్రేక్ష‌కుల‌కు అందించ‌డం ఆనందంగా ఉంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రూ మంచి స‌హ‌కారాన్ని అందించారు. చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది``అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments