Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి మరో అప్‌డేట్.. మూవీ రిలీజ్ ఎపుడంటే..?

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (09:42 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ ప్రేమికుల దినోత్సవం రోజున వెల్లడించారు. ఈ చిత్రం జూలై 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఆ చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే, మరో ప్రత్యేక స్టిల్‌ను రిలీజ్ చేసింది. 
 
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ యావత్తూ ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ హీరోగా వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు అమాతం పెరిగిపోయాయి. పెరిగిన ఈ అంచనాలకు తగినట్లుగానే చిత్ర యూనిట్‌ సినిమా మేకింగ్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడట్లేదు. 
 
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా అత్యంత రిచ్‌ లుక్‌తో తెరకెక్కిస్తున్నారు. 70వ కాలంలో రోమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలావుంటే, ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్‌ సినీ లవర్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ నుంచి ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. 
 
ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూలై 30వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించింది. మరోవైపు, ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హిందీ మినహా అన్ని భాషల్లో జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక హిందీ వెర్షన్‌కి మిథున్‌, మన్నన్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌ కంపోజ్ చేస్తున్నారు. 
 
ఇక ఈ విషయాన్ని వెల్లడించే సమయంలో చిత్ర యూనిట్‌ ఓ వినూత్న పోస్టర్‌ను విడుదల చేసింది. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ను పరిచయం చేస్తూ పోస్ట్‌ చేసిన పోస్టర్‌లో అఖండ భారత దేశం మ్యాప్‌తో పాటు మధ్యలో రైల్వే ట్రాక్‌ ఆకట్టుకుంటోంది. దీని బట్టి ఈ సినిమా రోమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న భారతదేశంతో ఏదో సంబంధం ఉండనున్నట్లు అర్థమవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments