Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజుగారి కోడిపులావ్ చిత్రం నుండి రచ్చ చేస్తున్న సునో సునామీ సాంగ్

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (14:41 IST)
Neha Desh Pandey
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం "రాజు గారి కోడిపులావ్" కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన "సునో సునామి" ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకోగాఈరోజు ఫుల్ సాంగ్ విడుదలైంది. క్యాచీ పదాలతో శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. లవ్ రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కుతున్న ఈ పాటకు 'మల్లిక్ వల్లభ' చరణాలు అందించగా.. 'ప్రవీణ్ మని' సంగీత సారథ్యంలో ప్రముఖ గాయకులు 'ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్' ఆలపించారు. "ఔరౌర కన్నె కోడి.. ఓ వయ్యారి వన్నెలాడి. ఇష్టపడినా లేడీ" అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియా లో విజయవంతంగా దూసుకుపోతుంది. 
 
రాజుగారి కోడిపులావ్ చిత్రం నుంచి గతంలో విడుదల చేసిన వీడియో మూవీ లవర్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర మెగాస్టార్ గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు.  
 
రీ యూనియన్ బ్యాచ్ గా కలిసిన కొంతమంది స్నేహితులు సరదాగా గడపడానికి ఒక అడవి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఎదురైన విపత్కర పరిస్థితుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన సాహసమే రాజుగారి పులావ్ సినిమా. ఆద్యంతం సస్పెన్స్ క్రిమ్ థ్రిల్లర్ తో పాటు అందమైన ప్రేమకథతో తెరకెక్కుటున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రేక్షకులకు ఉక్కిరిబిక్కిరి చేసి గొప్ప థ్రిల్లింగ్ అనుభూతిని రాజుగారి పులావ్ సినిమా కలిగిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. అలాగే సినిమాపై ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. 
 
నటీనటులు : శివ కోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేష్ పాండే, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments