Webdunia - Bharat's app for daily news and videos

Install App

టికెట్ కోసం క్యూలో మహేశ్‌బాబు: షాకైన నిహారిక.. ఫోన్ నెంబర్ తీసుకునేలోపే..?

Webdunia
సోమవారం, 30 మే 2022 (12:26 IST)
'మేజర్' సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా జూన్ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. 
 
మేజర్ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం.. సినిమా టికెట్ కోసం ఓ థియేటర్ క్యూలో నిల్చుంటుంది. 
 
అయితే, ఒకరి తర్వాత ఒకరిగా వచ్చిన కొందరు ఆమె కంటే ముందు నిల్చుంటారు. దీంతో నిహారిక ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత కాసేపటికి మేజర్ సినిమా హీరో అడవి శేష్ వచ్చి ఆమె ముందు నిల్చుంటాడు. దీంతో నిహారికకు, అతడికి మధ్య వాగ్వివాదం జరుగుతుంది.
 
వారి మధ్య గొడవ జరుగుతుండగానే మహేశ్‌బాబు వచ్చి నిల్చుంటాడు. అతడిని చూసిన నిహారిక షాక్ అయ్యింది. అప్పుడు మహేశ్.. మా స్నేహితులను కూడా పిలవొచ్చా? అని ప్రశ్నించగా, అందుకు ఆమె ఓకే అంటుంది. దీంతో లైన్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. 
 
ఈ సందర్భంగా మహేశ్ ఫోన్ నంబరు తీసుకోవాలని భావించి అడిగే లోపే అతడు వెళ్లిపోతాడు. అది చూసి నిహారిక అసంతృప్తికి గురవుతుంది. నిహారిక తన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments