Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ టిక్కెట్ల జీవోపై విచారణ వాయిదా : పుష్పకు షాక్

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (16:37 IST)
సినిమా టికెట్ ధరల జీవో రద్దుపై ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ మేరకు లంచ్ మోషన్ ధాఖలు చేయగా, దానిపై విచారణ జరిపి సోమవారానికి వాయిదా వేసింది. ఈ జీవో రద్దు కాకుంటే తమ థియేటర్లు మూసేసుకోవలసి వస్తుందనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. 
 
త్వరలో విడుదల కానున్న బడా చిత్రాల నిర్మాతలు ప్రభుత్వం పట్టుదలకు పోకుండా జీవోను వెనక్కి తీసుకుంటుందేమోనని ఆశగా చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనిని ప్రస్టేజ్‌గా తీసుకుని ముందుకు వెళుతోంది.
 
దీంతో పుష్పకు కష్టాలు తప్పేలా లేవు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ "పుష్ప" డిసెంబర్ 17న విడుదల కానుంది. ఆంధ్రప్రదేవ్ హైకోర్టు గురువారం జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే అది "పుష్ప"కు ప్లస్ అయి ఉండేది. విచారణ కాస్తా వాయిదా పడడంతో "పుష్ప" రాజ్‌కు షాక్ తప్పలేదు. 
 
దీని వల్ల ఈ సినిమాకు స్పెషల్ షోస్ ప్రదర్శించుకునే అవకాశం లేకపోగా టికెట్ రేట్లు కూడా పాతపద్ధతిలోనే ఉంటాయి. చివరి నిమిషం వరకూ సినిమా కోసం రాత్రి పగలూ తేడా లేకుండా పని చేస్తున్న చిత్రబృందానికి ఈ ట్విస్ట్ బాగా ఇబ్బందికరమైన విషయం. విచారణ సోమవారానికి వాయిదా పడటం వల్ల తొలి మూడు రోజుల్లో బన్నీ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు తప్పవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments