Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌గా పుష్ప ది రైజ్ చిత్రం స్పెష‌ల్ స్క్రీనింగ్

డీవీ
శనివారం, 17 ఫిబ్రవరి 2024 (16:53 IST)
Allu arjun-berlin
అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో  ఇండియ‌న్ సినిమా  త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం ఐకాన్ స్టార్ అల్లు  అర్జున్‌కు ద‌క్కిన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ఇటీవ‌ల  బెర్లిన్ 74వ ఇంట‌ర్నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనేందుకు జ‌ర్మ‌నీకి చేరుకున్నారు. ప్ర‌స్తుతం ఐకాన్‌స్టార్ బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లొ వున్నారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.

2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2  ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఆగ‌స్టు 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌గా పుష్ప ది రైజ్ చిత్రాన్ని స్పెష‌ల్ స్క్రీనింగ్ చేశారు నిర్వాహ‌కులు. దీంతో పుష్ప ది రైజ్‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఆనందంలో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments