Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్.. వచ్చే ఏడాది ఉంటుంది: బాలయ్య ప్రకటన.. పూరీ జగన్నాథ్ దర్శకుడు?

దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర విశేషాలతో తీసే సినిమా వచ్చే ఏడాది ఉంటుందని నందమూరి వారసుడు, నటుడు బాలయ్య ప్రకటించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తానని.. అందులో ఎన్టీఆర్ పాత

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (11:38 IST)
దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర విశేషాలతో తీసే సినిమా వచ్చే ఏడాది ఉంటుందని నందమూరి వారసుడు, నటుడు బాలయ్య ప్రకటించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తానని.. అందులో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని బాలయ్య ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్టీఆర్ సినిమా వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతుందని చెప్పారు. 
 
తెలుగు సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావు ఒక యుగకర్త. ఆయనది సినిమా చరిత్రలో ఓ శకం ఏర్పడింది. ఒక్క తెలుగు చిత్రరంగంలోనే కాదు .. పౌరాణిక పాత్రలు వేయడంలోను ఆయనకు ఆయనే సాటి. సినిమాల్లో ఎన్‌టీ రామారావు ఒక లెజెండ్. ఆయన వంటి మహా నటుడు మరొకరు పుట్టరనే చెప్పవచ్చు. అలాంటి మహానటుడి జీవిత చరిత్ర సినిమాగా రానుందని బాలయ్య ప్రకటించడంతో సినీ ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. 
 
ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైందని బాలయ్య చెప్పడంతో, దర్శక నిర్మాతలు ఎవరనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ను సంప్రదించారని తెలుస్తోంది. విష్ణు ఇందూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్టీ రామారావు జయంతి రోజైన మే 28వ తేదీన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించాలని బాలయ్య అనుకున్నట్లు సమాచారం.

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments