Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య గయ్యాళిగంప... ఇకపై ఆమెతో కలిసుండలేను : పుల్కిత్ సామ్రాట్

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో హీరో తన భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నాడు. తన భార్య గయ్యాళిగంప అని, ఇకపై ఆమెతో కలిసివుండలేనని తెగేసి చెప్పాడు. ఆ బాలీవుడ్ హీరో పేరు పుల్కిత్ సామ్రాట్. ఈ కుర్ర హీ

Webdunia
సోమవారం, 11 జులై 2016 (11:01 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో హీరో తన భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నాడు. తన భార్య గయ్యాళిగంప అని, ఇకపై ఆమెతో కలిసివుండలేనని తెగేసి చెప్పాడు. ఆ బాలీవుడ్ హీరో పేరు పుల్కిత్ సామ్రాట్. ఈ కుర్ర హీరో నటి యామి గౌతమ్‌తో ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. తొలుత ఈ వార్తలను పుల్కిత్ ఖండించినప్పటికీ.. యామి మాత్రం పెదవి విప్పలేదు. అయితే, తాజాగా పుల్కిత్ చేసిన వ్యాఖ్యలు యామితో కలిసివుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
తన భార్యకు గర్భస్రావం అయినప్పటి నుంచే శ్వేతకు అతడు దూరమవుతూ వచ్చాడని తాజాగా వెల్లైంది. ఈ ఆరోపణలను అతడు తోసిపుచ్చాడు. తన భార్య శ్వేత రొహిరతో కలిసుండలేనని తెగేసి చెప్పాడు. 'ఈ వార్త చదివి షాక్కు గురైయ్యాను. ఇది మా వ్యక్తిగత విషయం. మా ఇద్దరికీ అది చాలా బాధ కలిగించింది. మాతృత్వం ఎవరికైనా వరమే. కానీ తప్పాంతా నాదే అయినట్టు బురద చల్లుతున్నారు. ఎవరేం మాట్లాడినా ఇన్నాళ్లు సహించినట్టు చెప్పుకొచ్చారు. 
 
నిజమేంటే బయట పెట్టేస్తా. శ్వేతకు గర్భస్రావం జరిగి నాలుగేళ్లైంది. అప్పటికీ యామి గౌతమ్ ఎవరో నాకు తెలియదు. సానుభూతి పొందేందుకు నా ఇమేజ్‌ను శ్వేత దెబ్బతీస్తొంది. వ్యక్తిగత విషయాలను బహిరంపరచి రచ్చ చేస్తోంది. ఆమె ఈవిధంగా ప్రవర్తిస్తుందని ఊహించలేదు. ఇక ఆమెతో ఎటువంటి సంప్రదింపులు సాగించను. శ్వేతతో నా వివాహ బంధం ముగిసినట్టే'నని పులకిత్ సామ్రాట్ పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత యామి గౌతమ్‌తో ఈ హీరో ముంబైలో సహజీవనం చేస్తున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

అందాల పోటీలపైనే కాదు.. అగ్ని ప్రమాదాలపై కూడా దృష్టిసారించండి : కేటీఆర్

పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడు, ఎదురుగా వధువు శవం

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments