Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రైట్ రైట్' ఆద్యంతం మెప్పించింది : నిర్మాత ఎం.ఎస్‌.రాజు

Webdunia
శనివారం, 11 జూన్ 2016 (20:59 IST)
యంగ్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన 'రైట్ రైట్' గురించి చాలా మంది ఫోన్లు చేసి ప్ర‌శంసిస్తుంటే ఆనందంగా ఉందని ఆ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం సుమంత్ కెరీర్లో ఇంత త్వ‌ర‌గా ఇలాంటి సినిమాను చేసి మెప్పించడం తండ్రిగా నాకు చాలా సంతోష‌దాయ‌కంగా ఉందన్నారు. 
 
సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు స‌మ‌ర్పించిన 'రైట్ రైట్' శుక్రవారం విడుద‌లైంది. శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మించారు. పూజా జ‌వేరి నాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో 'బాహుబ‌లి' ఫేమ్ ప్ర‌భాక‌ర్ కీల‌క పాత్ర‌లో పోషించారు. 
 
ఈ సినిమా గురించి శ‌నివారం ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ 'రైట్ రైట్' చూశాను. సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ను మ‌ను చాలా బాగా తెర‌కెక్కించారు. సినిమా ఆద్యంతం ఫ్రెష్‌గా, ఎక్క‌డా అశ్లీల‌త‌కు తావు లేకుండా, చూస్తున్నంత సేపూ ఆహ్లాద‌క‌రంగా అనిపించింది. తొలి స‌గం చూసినప్పుడు బావుంద‌నిపించింది. రెండోభాగం చూశాక ఇంకా బావుంద‌నిపించింది. క‌థ‌లో ట్విస్ట్, స‌స్పెన్స్ ఎలిమెంట్స్ క‌న్విన్సింగ్‌గా ఉన్నాయి. 
 
కండ‌క్ట‌ర్ పాత్ర‌లో సుమంత్ అశ్విన్ చాలా బాగా నటించాడు. ఎస్.కోట నుంచి గ‌విటికి వెళ్లే బ‌స్సులో జ‌రిగే క‌థ ఇది. అక్క‌డి మ‌నుషులు, వారి మ‌న‌స్త‌త్వాల‌ను ద‌ర్శ‌కుడు మ‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. కీల‌క స‌న్నివేశాల్లో జె.బి. ఇచ్చిన నేప‌థ్య సంగీతం, పాట‌లు బావున్నాయి. లొకేష‌న్లు కూడా కొత్త‌గా క‌నిపిస్తాయి. చూసిన వారికి క‌న్నుల‌పండువ‌గా ఉంటుంది. నాజ‌ర్ పాత్ర హైలైట్ అవుతుంది. ష‌క‌ల‌క శంక‌ర్‌, ధ‌న్‌రాజ్‌, జీవా, భ‌ర‌త్‌రెడ్డి పాత్ర‌లు మెప్పిస్తాయి. బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ కొత్త‌గా క‌నిపించాడు అని చెప్పుకొచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్ఎంపీవి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది.. లక్షణాలు.. చికిత్స... జాగ్రత్తలు ఏంటి?

పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. మాస్కులు ధరించాలా? వద్దా? కర్నాటక అడ్వైజరీ

టీచర్‌కు నోటు పుస్తకం చూపిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన బాలిక...

ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలకు భయపడి కారులో ప్రేమ జంట ఆత్మహత్య!!

నేపాల్‌లో భారీ భూకంపం - భారత్ కూడా ప్రకంపనలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments