Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద శాతం వినోదాన్ని పంచే శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ తాజా చిత్రం

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ 'ఓ చినదాన', 'ఒట్టేసి చెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్‌ శ

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (16:03 IST)
'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ 'ఓ చినదాన', 'ఒట్టేసి చెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్‌ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్‌ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ ఆగస్టు 12వ తేదీతో పూర్తయింది. 
 
ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ, ''హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆగస్టు 12వ తేదీ వరకు జరిగిన మొదటి షెడ్యూల్‌తో 60 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఆగస్టు 16వ తేదీన రెండో షెడ్యూల్‌ స్టార్ట్‌ అయింది. నాన్‌స్టాప్‌గా జరిగే రెండో షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. 
 
మా బేనర్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం 'బెంగాల్‌ టైగర్‌' తర్వాత చేస్తున్న సినిమా ఇది. డైరెక్టర్‌ సత్తిబాబు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు హండ్రెడ్‌ పర్సెంట్‌ వినోదాన్ని అందించే ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ చిత్రమవుతుంది'' అన్నారు. 
 
ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, శృతి సోది జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీ, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చమ్మక్‌ చంద్ర, పిళ్ళా ప్రసాద్‌, విద్యుల్లేఖా రామన్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో అపోలో ఫౌండేషన్.. మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం

ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)

రాజకీయ నేతలు.. ధనవంతులంతా కుంభమేళాలో చనిపోవాలి.. అపుడే వారికి మోక్షం లభిస్తుంది...

గాజాను స్వాధీనం చేసుకుంటాం : డోనాల్డ్ ట్రంప్

ప్రియురాలికి రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించిన చోర శిఖామణి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments